పవన్ కళ్యాణ్ జంధ్యం ధరించటం వెనక రహస్యం ఏమిటో తెలుసా?
‘అజ్ఞాతవాసి’ సినిమా విడుదల అయ్యాక పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఒక వార్త హల్ చల్ చేసింది. అది ఏమిటంటే పవన్ కళ్యాణ్ జంధ్యం ధరించాడని…. అజ్ఞాతవాసి ఆఫీస్ ఎపిసోడ్స్ లో పవన్ టీ షర్ట్ వేసుకుంటాడు. ఆ టీ షర్ట్ నుంచి జంధ్యం లీలగా కన్పిస్తోందని చర్చలు జోరుగానే సాగాయి. అసలు పవన్ జంధ్యం వేసుకోవటానికి గల కారణాలను చూస్తే…. పవన్ కళ్యాణ్ కి త్రివిక్రమ్ ఆప్తుడని పవన్ సందర్భం వచ్చిన ప్రతి సారి చెపుతూనే ఉంటాడు. త్రివిక్రమ్ కి దైవ చింతన ఎక్కువ. అలాగే రోజు మూడు సార్లు సంధ్యావందనం చేస్తాడు. అంతేకాక త్రివిక్రమ్ ఒక గురువును ఫాలో అవుతూ ఉంటాడు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఆ గురువును ఫాలో అవుతున్నట్టు సమాచారం. సాధారణంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య సామాజిక వర్గాల్లోనే జంధ్యాన్ని వేసుకుంటారు. కానీ పవన్ కాపు సామజిక వర్గానికి చెందినవాడు. కేవలం త్రివిక్రమ్ సూచన మేరకే పవన్ కళ్యాణ్ జంధ్యం ధరించాడనే వార్తలు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. పవన్ కూడా చాలా సందర్భాలలో నాకు కులం పట్టింపు లేదని చెప్పాడు. పవన్ జంధ్యం ధరించాడనే చర్చ గోపాల గోపాల సినిమా సమయంలో కూడా వచ్చింది. మరల ఇప్పుడు ‘అజ్ఞాతవాసి’ సినిమా సమయంలోను చర్చకు వచ్చింది.
అయితే పవన గోపాలా గోపాలా సినిమా సమయంలో ధరించాడా లేదా అత్తారింటికి దారేది సినిమా సమయంలో ధరించాడా అనేది క్లియర్ గా తెలియదు. జంధ్యం విశిష్టత తెలుసుకొని దాని మీద ఆసక్తితో పవన్ వేసుకున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇదే కనుక కరెక్ట్ అయితే పవన్ నన్ను ఒక కులానికి పరిమితం చేయవద్దని అనే మాటలో అర్ధం ఉన్నట్టే….