Movies

జబర్దస్త్ లో అవకాశం ఇచ్చిన వేణుని కష్టాల్లో ఉన్నాడని తెలిసి పట్టించుకోని సుధీర్ టీం

‘జబర్దస్త్’ కార్యక్రమం కామెడీ ప్రోగ్రామ్స్ లో రారాజుగా ముందుకు సాగిపోతూ నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఈ కార్యక్రమం ఎంతో మంది ఆర్టిస్ట్ లకు జీవితాన్ని ఇచ్చింది. జబర్దస్త్ ప్రారంభంలో వేణు,ధనరాజ్, తాగుబోతు రమేష్ వంటి వెండితెరపై నటించిన వారు జబర్దస్త్ లో టీమ్ లీడర్స్ గా ఉండి ఎంతో మంది కొత్తవాళ్లను జబర్దస్త్ లోకి తీసుకువచ్చి వారికీ లైఫ్ ని ఇచ్చారు. వేణు టీమ్ నుండి మొదట గెటప్ శ్రీను,సుడిగాలి సుధీర్ పరిచయం అయ్యారు.

వేణుకు సినిమా అవకాశాలు ఎక్కువగా రావటంతో జబర్దస్త్ ని వదిలేసి సినిమాల్లో బిజీ అయ్యిపోయాడు. అయితే గతంలో వలే సినిమా అవకాశాలు రాకపోవటంతో వేణు సుదీర్ టీమ్ లోకి రావాలని ప్రయత్నం చేసాడట.

ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో వేణుని టీమ్ లోకి తీసుకోవటం అంత మంచిది… కాదని భావించటంతో… విషయం తెలిసిన వేణు కాస్త బాధపడ్డాడని సమాచారం. ఏది ఏమైనా వేణు అవకాశం ఇవ్వబట్టే సుదీర్,గెటప్ శ్రీను ఈ స్టేజ్ లో ఉన్నారనేది వాస్తవం.

సుదీర్,గెటప్ శ్రీను లకు వేణు మీద అభిమానం ఉన్నా ఇప్పుడు ఉన్న పరిస్థితులకు వేణుని టీమ్ లోకి తీసుకోవటం అంత కరెక్ట్ కాదని భావించటంతో…ఈ పరిస్థితి నుండి ఎలా బయటపడాలా అని తీవ్రంగా ఆలోచిస్తున్నారట సుదీర్,గెటప్ శ్రీను.

సుదీర్ వాళ్ళు తమకు అవకాశం ఇచ్చిన వేణుకు అవకాశం ఇవ్వలేకపోతున్నామని చాలా బాధపడుతున్నారట. మరో వైపు వేణు కూడా అవకాశం ఉంటే ఇస్తారు…లేకపోతే వారు మాత్రం ఏమి చేస్తారని లైట్ గా తీసుకున్నట్టు సమాచారం.

ఏది ఏమైనా వేణు మరోసారి జబర్దస్త్ లోకి ఎంటర్ అయ్యి అందరిని అలరించాలని ఆశిద్దాం.