సాయి పల్లవి మేకప్ వేసుకోక పోవడానికి కారణం ఎవరో తెలుసా?
సాయి పల్లవి మలయాళంలో ‘ప్రేమమ్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో అచ్ఛమైన మళయాళీగా నటించి ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకుంది. అలాగే తెలుగు ‘ఫిదా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి అచ్చమైన తెలంగాణ అమ్మాయిగా నటించి తెలుగువారి మనస్సుల్లో స్థానం సంపాదించింది. మిడిల్ క్లాస్ అబ్బాయి లోను నాని కి జోడిగా చలాకీగా నటించి అందరిని మెప్పించి సినిమా హిట్ విషయంలో తనదైన ముద్రను వేస్తుంది.
ఇప్పుడు తమిళంలో కూడా తన స్టామినా చూపటానికి రెడీ అయింది. విజయ్ దర్శకత్వంలో కరు చిత్రం ద్వారా కోలీవుడ్ లో ఎంటర్ కాబోతోంది. ఇది తెలుగులో “కణం” గా రానుంది. ఇందులో నాలుగేళ్ల పాపకి తల్లిగా సాయిపల్లవి నటించింది.
ఈ సినిమా ప్రమోషన్లో పాల్గొన్న సాయి పల్లవి అనేక ఆసక్తికర విషయాలు చెప్పింది. తాను మేకప్ వేసుకోకుండా నటించడానికి “ప్రేమమ్” దర్శకుడు ఆల్ఫోన్స్ పుతెరిన్ కారణమని చెప్పింది.
సహజంగా నటించమని ఆయనే ప్రోత్సహించినట్లు వెల్లడించింది. “ఆల్ఫోన్స్ తో పాటు నేను పనిచేసిన దర్శకులందరూ నా ఆత్మవిశ్వాసం పెరగడానికి దోహదపడ్డారు.
అమ్మాయిల్లో ఆత్మస్థైర్యం పెంచడానికి కూడా నేను మేకప్ లేకుండా నటిస్తున్నాను” అని వివరించింది. అనేక సార్లు వాయిదా పడిన ఈ కణం సినిమా ఈనెలలో విడుదల కానుంది.