Movies

జూనియర్ ఎన్టీఆర్ కి ప్రమాదం అనే వార్తలో…అసలు నిజం ఇదే…

ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చిందంటే నిమిషాల్లో అది ఎంతమందికి చేరుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదే సెలబ్రెటీ అయితే ఇంకా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యిపోతుంది. ఈ వార్తలు ఎలా వస్తాయో తెలియదు. కొన్ని వార్తల కారణంగా సెలబ్రెటీలు బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు. కానీ అభిమానులు మరియు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ ఉంటారు.

ఇప్పుడు అలాంటి వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎన్టీఆర్ కి ప్రమాదం జరిగిందని వార్తలు రావటంతో ఒక్కసారిగా నందమూరి అభిమానులు ఉలిక్కిపడ్డారు.
Rajamouli,NTR,Ram charan
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్,రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకి సంబంధించి టెస్ట్ షూట్ కోసం లాస్ ఏంజలస్ వెళ్లారు. అక్కడ ఎన్టీఆర్ గాయపడ్డాడనే వార్త ఒకటి బయటకు వచ్చింది.
Ram charan And NTR
అసలు ఈ విషయంలో ఎంతవరకు నిజమో తెలుసుకుందాం. సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తకు ఎన్టీఆర్ PRO మహేష్ కోనేరు స్పందించారు. ఈ వార్తలో నిజం లేదని…ఎన్టీఆర్ కి ఏమి కాలేదని అన్నారు.

ఎన్టీఆర్ లాస్ ఏంజలస్ లో షూట్ పూర్తి చేసుకొని హైదరాబాద్ వచ్చేశారని…ఎక్కువ సమయాన్ని జిమ్ లో గడుపుతున్నారని మహేష్ చెప్పారు.