Movies

రవితేజ-శ్రీనువైట్ల సినిమాలో ఆ “చైల్డ్ ఆర్టిస్ట్” ది మెయిన్ రోల్..! ఆ చిన్నారి ఏ స్టార్ హీరోయిన్ కూతురంటే.?

నేలటికెట్ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ చేయనున్న సినిమాలో అను ఇమ్యానుయేల్ హీరోయిన్ గా ఖరారు అయింది. .స్టార్ కమెడియన్ కమ్ హీరో సునీల్ ఈ చిత్రంలో ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ చేయనున్నారు. అంతేకాదు ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్స్ కీలకం కానున్నారు. ఈ పాత్రల్లో ఒకదాన్ని రవితేజ తనయుడు మహాధన్ కనిపించనున్నాడు.

ఇతను ఇదివరకే రాజాధి గ్రేట్ సినిమాలో చిన్నప్పటి రవితేజగా అదరగొట్టాడు. ఇప్పడు మళ్ళీ ఈ చిత్రంలో నటించబోతున్నాడు. మరోపాత్రలో నిన్నటితరం నటి లయ కూతురు శ్లోక పోషిస్తుంది.“అమర్ అక్బర్ ఆంటోనీ” పేరుతో రోపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ మూవీతో హిట్ ట్రాక్ లో రావాలని శ్రీను వైట్ల శ్రమిస్తున్నారు.

పెళ్ళి తర్వాత అమెరికాలో సెటిల్ అయిన లయ ఇప్పటివరకు మళ్లీ నటించలేదు..త్రివిక్రమ్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుందనుకునే అభిమానుల ఆశలను నీరుగార్చింది .ఎన్టీయార్ కి అత్తగా చేయలేనంటూ చెప్పేసింది.మరోవైపు తన కూతుర్ని చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేస్తుంది.

ఈ చిత్రం షూటింగ్ దాదాపు మొత్తం యునైటెడ్ స్టేట్స్ లొనే జరగనుంది. న్యూయార్క్, డెట్రాయిట్, సాల్ట్ లేక్ సిటీ, ఇతర లొకేషన్స్ లో చిత్రీకరించనున్నారు..ఎలాగూ ఉండేది యుఎస్ లోనే… షూటింగ్ కూడా ఎక్కువగా అక్కడే కాబట్టి లయకు ఇది ప్లస్సే..అటు కుటుంబాన్ని,ఇటు కూతురి షూటింగ్స్ రెండింటిని బ్యాలన్స్ చేసుకోవచ్చు.