Movies

శ్రీహరి చివరి కోరిక ఇంకా నెరవేరలేదు అంటూ బోరున ఏడ్చిన డిస్కో శాంతి

పేద కుటుంబం నుండి వచ్చి మొదట ఫైటర్ గా తెలుగు సినీ పరిశ్రమకు వచ్చాడు శ్రీహరి. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో విలన్ గా చేసి అభిమానులను సంపాదించాడు. చివరికి రియర్ స్టార్ హీరో అని అనిపించుకున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం శ్రీహరి చనిపోయిన సంగతి తెలిసిందే. ఇక అయన మరణం తట్టుకోలేక ఆమె భార్య డిస్కో శాంతి కొంత అనారోగ్యానికి గురి అయింది. ఆమె అనారోగ్యం నుండి కోలుకొని పిల్లల మీద దృష్టి పెట్టింది. డిస్కో శాంతి ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీహరి చివరి కోరిక గురించి చెప్పింది.

శ్రీహరి చివరి కోరిక తీరకుండానే చనిపోయాడని బాధపడింది. శ్రీహరి చివరి కోరిక ఏమిటో తెలుసా? శ్రీహరి పెద్ద కొడుకును సినీ పరిశ్రమలో హీరోగా నిలబెట్టాలని అనుకున్నాడు. అలాగే శ్రీహరి చనిపోయాక అయన కుటుంబం కొంచెం ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొన్న ఆ తర్వాత మళ్ళీ మాములు స్థితికి వచ్చింది.

ప్రస్తుతం ఇద్దరూ పిల్లలను చదివిస్తుంది. డిస్కో శాంతి మరల సినిమాల్లో నటించాలని అనుకుంటుంది. పెద్ద అబ్బాయి చదువు పూర్తి అయ్యాక సినిమా హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తాడని చెప్పింది డిస్కో శాంతి.

తనకు బాగా తెలిసిన దర్శకులకు తనకు తగ్గ పాత్రలు ఉంటే చెప్పమని అడిగిందట. ఏది ఏమైనా డిస్కో శాంతి శ్రీహరి ఆఖరి కోరిక తీర్చటానికి ప్రయత్నాలు చేస్తుంది. పెద్ద అబ్బాయి చదువుతూనే అవకాశాలు వస్తే హీరోగా యాక్ట్ చేస్తాడని అంటోంది డిస్కో శాంతి.