భరత్ అనే నేను హీరోయిన్ ఎవరి కూతురో తెలుసా?!!
‘ఎం.ఎస్.ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ’ మూవీ తో బాలీవుడ్ లో సెన్సేషనల్ అయిన ‘కైరా అడ్వాణీ’ పేరు ఇప్పుడు టాలీవుడ్ లో మారుమోగుతోంది. ‘మహేష్ బాబు – కొరటాల శివ’ కాంబినేషన్ లో విడుదలై ఇప్పుడు తెలుగులో దుమ్ము రేపుతున్న ‘భరత్ అను నేను’ అనే మూవీ లో కైరా తన నటనతో ఆకట్టుకుంది. తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సినిమాతోనే హిట్ కొట్టింది. సినిమాలో మహేష్ ప్రేమికురాలుగా ఈమె అభినయానికి, అందానికి మంచి మార్కులు పడ్డాయి.. ఈ సినిమాతో పాపులర్ అయిన కైరా ఎవరు? ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? సినిమాల్లోకి ఎలా వచ్చింది? ఈమె తండ్రి ఎవరు అనేది ఆసక్తిగా మారింది..
కైరా అడ్వాణీ మహారాష్ట్ర రాజధాని ముంబైలో 1991 జూలై 31న జన్మించింది. ఈమె తల్లి జెనెవీవ్ జాఫ్రీ, తండ్రి పేరు జగదీప్ అడ్వాణీ.. తండ్రి సింధూ ప్రాంత మూలాలున్న హిందు కాగా.. తల్లి యూరప్ కు స్కాట్లాండ్ దేశ వాసి. కైరాకు మిషాల్ అనే తమ్ముడూ ఉన్నాడు.. కైరా తండ్రి జగదీప్ బిజినెస్ మ్యాన్ గా ముంబైలో రాణిస్తున్నారు.
‘భరత్ అనే నేను’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనప్పటికీ కైరా ఇండస్ట్రీకి పరిచయమైంది మాత్రం 2014లోనే. ఆ సంవత్సరం జూన్ లో రిలీజ్ అయిన ‘ఫగ్లీ’ సినిమాతో బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో కైరా నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే ఎంఎస్ ధోని (ది అన్ టోల్డ్ స్టోరీ)తోనే విపరీతమైన క్రేజ్ సంపాదించింది కైరా.
సినిమాలంటే చిన్నతనం నుంచే ఇష్టం పెంచుకుంది కైరా. అయితే తల్లి జెనెవీవ్ జాఫ్రీ మాత్రం కైరా డిగ్రీ కంప్లీట్ చేస్తేనే కానీ సినిమాల్లోకి అనుమతించనని స్పష్టంగా చెప్పింది. అలాగే తండ్రి జగదీప్ అడ్వాణీకి కూడా కైరా సినిమాల వైపు రావడం అస్సలు ఇష్టం లేదు. చదువుకే ప్రాధాన్యమని చెప్పేవారు.
అయితే అమీర్ ఖాన్ సినిమా ‘త్రీ ఇడియట్స్ ’ చూసిన తరువాత పిల్లల అభిరుచులకు ప్రాధాన్యం ఇవ్వాలని కైరా తల్లిదండ్రులు ఈమెను సినిమాల్లోకి రావడానికి ఒప్పుకున్నారట.. కైరా చదువులోనూ నిర్లక్ష్యం వహించలేదు. మాస్ కమ్యూనికేషన్స్ లో డిగ్రీ కంప్లీట్ చేసింది కైరా. అలా అమ్మకిచ్చిన మాటను నిలబెట్టుకుంటూనే మరో పక్క తన కిష్టమైనా సినిమాల్లో రాణిస్తోంది. సినిమాల్లోకి రాకముందు యాడ్స్ లోనూ మెరిసింది కైరా..