Politics

త్రివిక్రమ్ కాదు… పవన్ స్క్రిప్ట్ రైటర్ మారాడా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ రైటర్ ఎవరనే విషయం మీద పొలిటికల్ సర్కిల్ లో చాలానే చర్చ జరుగుతుంది. అయన ప్రసంగాలలో పవర్ ఉంటుంది. స్పీచ్ లో పంచ్ ఉంటుంది. పద్దతిగా ఒక్క విషయాన్నీ కూడా మర్చిపోకుండా పవన్ సమగ్రంగా మాట్లాడతారు. తన అభిమానులకు ఏమి కావాలో అదే వివరిస్తున్నాడు. ఎలా చెప్పాలో అలానే చెపుతున్నాడు. పొలిటికల్ స్పీచ్ కి సినిమా పంచ్ లు అద్ది మరీ ఇరగదీసి చెపుతున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. గుంటూరు లో జరిగిన జనసేన ఆవిర్భావ సభ తర్వాత సీన్ మారిపోయింది. రాజకీయ వ్యూహాలు కూడా మారినట్టు కన్పిస్తున్నాయి. ఇంతకాలం తానే నెత్తి మీద పెట్టుకున్న టీడీపీని బంగాళాఖాతంలో విసిరి పాడేయాలని పిలుపునిచ్చాడు.

తాను దగ్గర ఉండి గెలిపించిన టీడీపీని ఎక్కి పారేసాడు పవన్ కళ్యాణ్. ఇక లోకేష్ అవినీతి సామ్రాట్ అనే రేంజ్ లో స్పీచ్ ఇచ్చాడు పవన్.
కనీసం బాబుకు తన కొడుకు లోకేష్ చేసే అవినీతి తెలుసా అని ప్రశ్నించాడు. అంతే తెలుగుదేశం పార్టీలో కుదుపు మొదలైంది. జగన్ విమర్శిస్తే ప్రత్యర్థి కాబట్టి కామన్ అని అంటారు. కానీ పవన్ నోటి నుండి వచ్చిన తీవ్ర విమర్శలతో బాబుతో సహా అందరూ కుదేలు అయ్యారు.

స్పీచ్ ఒక్కసారిగా ఎలా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పొలిటికల్ స్పీచ్ లు, రాజకీయ వ్యూహాలు మారినప్పుడు మోడీ అయినా రాహుల్ గాంధీ అయినా బాబు అయినా స్పీచ్ లు రాయించుకుంటారు. లైన్ టూ లైన్ కాకపోయినా ఏమి మాట్లాడాలి అనే విషయం మీద కీ పాయింట్స్ రాయించుకుంటారు.

గుంటూరు సభలో పవన్ పేపర్ల కట్టతో స్టేజి మీదకు వచ్చాడు. ఒక్కో పేపర్ తీస్తూ ఒక్కో డైలాగ్ తో టీడీపీ ని, కేంద్రం మీద కొన్ని డైలాగ్స్ తో స్పీచ్ సాగింది. అయితే ఈ స్పీచ్ ఎవరు రాసారు అనే విషయం మీద చర్చ సాగుతుంది.

బీజేపీలో టీడీపీని అనుక్షణం విమర్శించే ఒక కీలకమైన వ్యక్తి రాసి ఇచ్చిన స్క్రిప్ట్ అని అప్పట్లో సైకిల్ నేతలు విమర్శించారు. ఆ విమర్శలను పవన్ తిప్పికొట్టాడు. పవన్ కి పొలిటికల్ స్పీచ్ లు త్రివిక్రమ్ రాస్తాడని మొదటి నుంచి ప్రచారం ఉంది.

అజ్ఞాతవాసి సినిమా ప్లాప్ తర్వాత పవన్ కి త్రివిక్రమ్ కి చెడిందనే వార్తలు వచ్చాయి. త్రివిక్రమ్ హిట్ కోసం ఎన్టీఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు పవన్ కి పొలిటికల్ స్పీచ్ లు ఎవరు రాస్తున్నారనేది ఎవరికీ అర్ధం కానీ ప్రశ్నగానే ఉండిపోయింది. ఈ విషయం మరికొన్ని రోజుల్లో తెలుస్తుందని ఆశిద్దాం.