Politics

“జనసేన” లో “ఈ క్లారిటీ మిస్” అయ్యిందా..?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఖరి చూస్తుంటే తన అన్న చిరంజీవి పరిస్థితే మళ్ళీ తనకి వచ్చేలా ఉందేమో అనే సందేహం కలుగుతోంది..అయితే తన అన్న స్థాపించిన ప్రరాపా పార్టీ మాత్రం ఎంతో హుందా రాజకీయాలు చేసింది ఎక్కడా చిన్నపిల్లల ఆటల మాదిరి నడుచుకోలేదు..ప్రరాపాలో ఎంతో మంది సీనియర్ నేతలు..తలపండిన రాజకీయ నాయకులు ఉన్నా సరే వారందరూ ఆ సమయంలో చిరంజీవికి ఒక నిర్దిష్టమైన దారిని చూపించలేక పోయారు..అయితే ఇప్పుడు పవన్ పెట్టిన పార్టీ కి అసలు దిశా నిర్దేశం లేదు. పవన్ కళ్యాణ్ ఎప్పడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం దిశగా అందరూ పరుగులు పెట్టాల్సిందే..పార్టీ కి ఒక దీర్ఘకాలికమైన ప్రణాళిక లేదు…చెప్పే మాటలు చేసే పనులు మాత్రం కోటలు దాటుతాయి , కానీ చేతలు మాత్రం కనిపించడంలేదు. ఎన్నికలకు ఇంకా ఏడాది కూడా సమయంలేదు .

అందునా ముందస్తు ఎన్నికలు అంటూ వార్తలు వినిపిస్తున్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు గట్టిగానే కసరత్తు చేస్తుంటే .. జనసేన మాత్రం ఇంకా వెనుకబడిపోయే కనిపిస్తోంది…ఆలోచనల్లో మునిగి తేలుతోంది..ఏపీ మొదలు తెలంగాణలో సైతం అన్ని నియోజక వర్గాలలో మా పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించిన పవన్ ఇప్పటి వరకూ ఆ దిశగా అడుగులు వేయకపోవడం తన టైం పాస్ రాజకీయానికి నిదర్సనం.

పవన్ కళ్యాణ్ కి ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఒక మీటింగ్ పెట్టి హడావుడి చేయడం ఆ తరువాత సైలెంట్ అయిపోవడం ఆ పార్టీకి పరిపాటిగా మారింది. పార్టీ ముఖ్య నాయకుల అంతర్మధనం తెలియక కిందస్థాయి కార్యకర్తలు , పవన్ అభిమానులు లోలోపల అసంతృప్తికి గురవుతున్నారు..

అసలు పార్టీలో ఏమి జరుగుతుందో తెలియక సతమతమవుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు..కానీ పవన్ కళ్యాణ్ అభిమానులే పార్టీలో ఎదో ఒక హడావిడి చేస్తూ పార్టీని వార్తల్లో ఉంచుతున్నారు..ఎక్కువగా జనసేనలో కనిపించేది అభిమానుల హడావిడే.

ఇక పవన్ కళ్యాణ్ కి ఉన్న అతిపెద్ద మైనస్ ఏమిటంటే ట్విట్టర్..ప్రజా ఉద్యమాలు కానీ ప్రజల కోసం సపోర్ట్ చేసే విషయాలు కానీ వారి గొంతు వినిపించే విషయాలు అన్నీ కూడా ప్రజా క్షేత్రంలో జరగాలి కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ట్విట్టర్ వేదికగా పోరాటం చేస్తాడు..అభిమానులకి సైతం ఈ విషయంలో ఎంతో విసుగు తెప్పిస్తున్నాడు.

ఒక రాజ‌కీయ స‌ల‌హాదారుని నియ‌మించుకుని బాధ్య‌త‌లు బ‌దిలీ చేసుకుందామ‌న్నా దేవ్ వ్య‌వ‌హారంలో ఆ పార్టీ బాగా అభాసుపాలు అయ్యింది. నిత్యం కార్యకర్తలతో చర్చలు, సమావేశాలు, సలహాలు, సూచనలు వంటి విషయాలను ఆ పార్టీ పట్టించుకోనట్టే కనిపిస్తోంది..జనసేన లో జనం ఉన్నారా లేరా..పవన్ కళ్యాణ్ లో క్లారిటీ ఉందా లేదా అనేది ప్రజలే డిసైడ్ చేస్తారు.