మెహబూబా హీరోయిన్ ఎవరి కూతురో తెలిస్తే షాక్ అవుతారు
పూరి సినిమాలు ఎలా ఉన్నా …. అంటే హిట్ అయిన ఫట్ అయిన ఆ సినిమాల్లో నటించిన హీరోయిన్స్ మాత్రం బాగా హిట్ అవుతారు. ఈ విషయం అందరికి తెలిసిందే. అమ్మ నాన్న ఒక తమిళ్ అమ్మాయి సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మురిపించిన ఆసిన్ టాలివుడ్,కోలివుడ్ అలాగే బాలీవుడ్లో మంచి పేరుని సంపాదించుకుంది. బిజినెస్ మాన్, టెంపర్ సినిమాలో నటించిన కాజల్ కూడా టాప్ హీరోయిన్ అని అనిపించుకుంది. ఇక పోకిరి హీరోయిన్ ఇలియానా అయితే అప్పట్లో టాప్ హీరోయిన్ గా నిలిచింది. ఇక మన పూరి కొడుకుతో ఒక సినిమా చేసిన విషయం తెలిసిందే. కొడుకు ఆకాష్ తో ఒక కొత్త హీరోయిన్ ను తెలుగు ఇండస్ట్రీ లోకి లాంచ్ చేసాడు.
ఆ హీరోయిన్ పేరు నేహా శెట్టి. నేహా , ఆకాష్ పూరీ ల కాంబినేషన్ లో వచ్చిన సినిమా మెహబూబా. ఇంతకీ ఈ నేహా శెట్టి ఎవరు ?….. ఎక్కడి నుండి వచ్చింది ?….. అన్న ప్రశ్నలు మిగిలిపోయాయి కదా….అయితే చూడండి. నేహా శెట్టి సొంత ఊరు బెంగుళూరులోని మంగళూరు. ఈమె 1990 వ సంవత్సరంలో జన్మించారు.
ఈమె తల్లితండ్రులు నిమ్మి శెట్టి , హరీష్ రాజ్ శెట్టి. ఈమెకు ఒక చెల్లి కూడా ఉంది తన పేరు నవమి శెట్టి. నేహాకు చిన్నతనం నుండి సినిమాలంటే పిచ్చి అందుకనే డిగ్రీ అవ్వగానే తన దారిని మోడలింగ్ వైపు మళ్లించింది. మంచి అందం,అభినయం ఉండటంతో క్లిక్ అయింది. ఆమె తన మొదటి సినిమాను 2016 లో కన్నడలో చేసింది. ఆ తర్వాత 2017 లో జాకీ 2 అనే సినిమాలో నటించింది.
ఆ సినిమా కూడా కన్నడలో మంచి విజయాన్ని సాధించింది. పూరి మెహబూబా సినిమా కోసం కొత్త హీరోయిన్ కోసం వెతుకుతూ ఉండగా నేహా పూరి దృష్టిలో పడింది. సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకున్న నేహాకు మంచి మార్కులే పడ్డాయి.