Movies

అసలు సిసలైన 2018 బ్లాక్ బస్టర్ రంగస్థలం ఎందుకో తెలుసా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ సినిమా అసలు సిసలైన బ్లాక్ బస్టర్ కి అర్ధం చెప్పింది. ప్రతి ఏరియాలో డిస్టిబ్యూటర్స్, బయ్యర్లకు విపరీతమైన లాభాలను తెచ్చిపెట్టింది. చాలా సినిమాలు లోకల్ గా బాగా ఆడిన US లో వసూళ్లు చేయలేకపోతున్నాయి. అక్కడ మంచి వసూళ్లను రాబట్టిన కొన్న వారికీ వారు పెట్టిన పెట్టుబడి మాత్రమే వచ్చేది. కానీ రామ్ చరణ్ రంగస్థలం లెక్క మాత్రం చాలా బిన్నంగా ఉంది. కేవలం ఓవర్సీస్ బయ్యర్లకే మిలియన్ డాలర్ల లాభాన్ని తెచ్చిపెట్టింది. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ని 9 కోట్లకు విక్రయించగా US లో 3.5 మిలియన్ డాలర్ల గ్రాస్ కి పైగా వసూళ్లు చేసి సంచలనం సృష్టించింది.

దీనిలో డిస్టిబ్యూటర్స్ షేర్ 1.9 మిలియన్ డాలర్లు పైనే వచ్చాయి. ఖర్చులు అన్ని తీసేస్తే 1.75 మిలియన్ డాలర్లు మిగుతుంది . అంటే నికరంగా లాభం 4 కోట్లకు పైనే అని చెప్పవచ్చు. సినిమా కొనుకోలు చేసిన కాస్ట్ లో సగానికి పైగా లాభాలు వచ్చాయంటే గత కొన్ని సంవత్సరాలలో ఇదే తొలిసారి.

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ ఈ అద్భుతమైన ఫీట్ ని సాధించింది. ఈ సినిమా టాలీవుడ్ కి ఓవర్సీస్ లో మంచి మార్కెట్ అందించింది రంగస్థలం సినిమాతో రామ్ చరణ్ తన సత్తా ఏమిటో చూపటమే కాక అందరికి లాభాలను అందించాడు. ఇలా ఎలా చూసుకున్న ఈ సంవత్సరం రంగస్థలం సినిమా అత్యుత్తమైన సినిమాగా నిలిచింది. .