Movies

ఢీ 10 యాంకర్ వర్షిణి ఎవరు… ఆమెకు పెళ్లి అయిందా… లేదా… నమ్మలేని నిజాలు

అందాల ఆరబోతను బుల్లితెరకు పరిచయం చేసిన యాంకర్స్ అనసూయ,రేష్మి. తెలుగు ఛానల్స్ లో యాంకర్స్ ఆంటే ఇంతకాలం పద్దతిగా ఉండేవారు. కానీ వీరి రాకతో ఎక్స్ పోజింగ్ తెర లేచింది. జబర్దస్త్ కార్యక్రమానికి అనసూయ,రేష్మి గ్లామర్ సొగసులను అద్దారు. ఇప్పుడు వారి బాటలోనే వర్షిణి పయనిస్తుంది. ఈ అమ్మడు తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో హాట్ హాట్ గా ఫోజ్ లు పెడుతుంది. తెలుగులో నెంబర్ వన్ డాన్స్ షో ఢీ 10 లో వర్షిణి కో యాంకర్ గా చేస్తుంది. ఈమె ఎవరు? ఎక్కడ నుంచి వచ్చింది? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. నిజానికి వర్షిణి యాంకర్ గా రాక ముందు కొన్ని సినిమాల్లో నటించింది. ఆమె అసలు పేరు షామిలి సౌందరాజన్.

చందమామ కథలు,బెస్ట్ యాక్టర్స్ తో పాటు కొన్ని సినిమాల్లో నటించింది వర్షిణి. బెస్ట్ యాక్టర్స్ సినిమా దర్శకుడు అరుణ్ పవార్ తో షామిలి ప్రేమలో పడింది. 2015 లో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నామని మీడియా ముఖంగా ప్రకటించారు. అయితే ఈ జంట [ప్రేమ వ్యవహారం పెళ్లి పీటల వరకు వెళ్లకుండానే విడిపోయినట్టు సమాచారం.

ప్రస్తుతం ఆమె సోషల్ మీడియా స్టేటస్ సింగిల్ అని ఉండటాన్ని బట్టి సింగిలా అని అర్ధం అవుతుంది. వర్షిణిది హైదరాబాద్. ఆమె తల్లితండ్రులు ఎప్పుడో ఇక్కడకు వచ్చి సెటిల్ అయ్యారు. ఈ బ్యూటీ మొదట మోడలింగ్ చేసింది. అందంతో పాటు టాలెంట్ కూడా ఉండటంతో సినిమాల వైపుకు అడుగులు వేసింది.

కానీ దర్శకుడితో ప్రేమ,పెటాకులు…ఆ తర్వాత సినిమా అవకాశాలు తగ్గటంతో ఢీ 10 కార్యక్రమంతో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది. ఒకవైపు షార్ట్ ఫిలిమ్స్,వెబ్ సిరీస్ లలో నటిస్తూ మరో వైపు యాంకర్ గా బిజీగా ఉంది.