Politics

అనంత్ అంబానీ బరువు తగ్గడానికి అసలు కారణం ఈ అమ్మాయి ప్రేమే

లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత ముఖేష్ అంబానీ ఇంట వరుస పెళ్లిళ్ల సందడి నెలకొంది. ఇప్పటికే అయన పెద్ద కొడుకు ఆకాష్,కుమార్తె ఇషాల నిశ్చితార్ధాలు పూర్తి అయ్యాయి. త్వరలోనే వారి వివాహానికి కూడా ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి. ఈ తరుణంలో అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ కూడా పెళ్లి పీటలు ఎక్కటానికి సిద్ధం అయ్యాడు. ఒకప్పుడు ఫ్యాట్ బాయ్ లా కన్పించిన అనంత్ ఎంతో కస్టపడి స్లిమ్ గా మారిపోయాడు. ఆకాష్,ఇషా కవల పిల్లలు కాగా, అనంత్ వారి తర్వాత జన్మించాడు. ప్రస్తుతం పెళ్లికొడుకుగా వచ్చిన అనంత్ వ్యాపార కుటంబానికి చెందిన రాధిక మెర్చంట్‌ను పెళ్లి చేసుకోవటానికి సిద్ధం అయ్యాడు.

ముఖేష్ అంబానీ పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ ప్రముఖ వజ్రాల వ్యాపారి రసెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతాను వివాహం చేసుకుంటున్నాడు. ఇక కూతురు ఇషా అంబానీ పిరమాల్ గ్రూప్ వారసుడు ఆనంద్ పిరమాల్ ను వివాహం చేసుకుంటుంది.

ఇప్పుడు అనంత్ కూడా తన కంటే ముందు పుట్టిన ఆకాష్,ఇషా బాటలోనే ఉన్నత వ్యాపార కుటుంబానికి చెందిన రాధికను జీవిత భాగస్వామిగా ఎంచుకోవటం విశేషమే. అనంత్,రాధిక ఇద్దరు చాలా కాలం నుండి స్నేహితులని సమాచారం. వంద కిలోలకు పైగా బరువు ఉండే అనంత్ స్లిమ్ గా తయారవ్వటానికి రాధిక ప్రోత్సాహం చాలా ఉందని అంటూ ఉంటారు.

కొద్దిరోజుల క్రితం జరిగిన ఓ ప్రైవేట్ సెర్మనీలో అనంత్ తన ప్రేయసి రాధికా మర్చంట్ కు ప్రపోజ్ చేసినట్టు సమాచారం. ఇక, తన ముగ్గురు పిల్లల పెళ్లిళ్లు ఒకేసారి కళ్లుచెదిరే రీతిలో మరెవ్వరికీ సాధ్యంకాని తరహాలో నిర్వహించాలని ముఖేష్ అంబానీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. బహుశా డిసెంబర్ లో ఆకాశ్, ఈషా, అనంత్ ల వివాహాలు ఒకే ముహుర్తానికి జరిగే అవకాశాలున్నాయి.