మహానటికి నాగ చైతన్య ఎంత పారితోషికం తీసుకున్నాడో తెలిస్తే అసలు నమ్మలేరు
ఈ నెల మే 9 వ తేదిన విడుదలైన సినిమా మహానటి. ఈ సినిమా అందరి అభిమానాన్ని పొందుతుంది.ఈ సినిమాలో సావిత్రి గారిలా నటించిన కీర్తి సురేష్ ఇప్పుడు అందరి గుండెల్లో అగ్రస్థానాన్ని పొందింది. సావిత్రి గారిలా అద్భుతం గా నటించింది. ఈ సినిమాను తమిళ్ భాషలో కూడా విడుదల చేశారు. ఈ సినిమాలో సల్మాన్ దుల్కర్ ,సమంత అలాగే విజయ్ దేవరకొండ తదితరులు కొన్ని ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఈ సినిమా డైరెక్టర్ కు ఇది రెండో సినిమా అయినా చాలా అద్భుతంగా తెరకెక్కించారు.ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరావు గారి పాత్రను వారి మనవడు అక్కినేని నాగ చైతన్య ను చేయమని మహానటి టీం ఆయనను సంప్రదించింది.
ఈ సినిమాలో చేయటానికి నాగ చైతన్య ఎంత పారితోషకం కావాలంటే అంత ఇస్తామని అన్నారట. కానీ నాగ చైతన్య వారి తాత గారి లాగ నటించగలనా అని ఒక్క నిమిషం ఆలోచించారట.
మహానటి టీం నాగచైతన్యను ఒప్పించింది. సావిత్రి గారిమీద, అక్కినేని నాగేశ్వరావు మీద అభిమానం తో పారితోషికం ఏమి వద్దని అన్నాడట నాగ చైతన్య.