Movies

ఒకే రూంలో కష్టాలు అనుభవించిన చిరంజీవి స్నేహితులు ఇప్పుడు ఏమంటున్నారంటే….

టాలీవుడ్ లో చిరంజీవి స్థానం చిరంజీవి దే. ఆ స్థానం ముందు ఎవరు లేరు. తర్వాత కూడా ఆ స్థానాన్ని ఎవరు దక్కించుకోలేరు. ఇప్పటికి హీరోల సినిమాలు పోటీ పడుతూ ఉంటాయి. కానీ నెంబర్ వన్ స్థానం మాత్రం అలాగే ఉండిపోయింది. ఒక మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చి తెలుగు సినీ సామ్రాజ్యాన్ని మూడు దశాబ్దాల పాటు ఏలిన మెగాస్టార్ చిరంజీవి గొప్పతనాన్ని ఇప్పటి హీరోలు తెలుసుకోవాలి. చిరంజీవి జనరేషన్ హీరోలను పక్కన పెడితే ఆ తర్వాత చిరంజీవి స్థాయికి కాకపోయినా ఓ పెద్ద స్టార్ హీరోగా ఎదిగే అవకాశం చాలా మందికి వచ్చింది. కానీ వారందరు చిరంజీవి లాగా కెరీర్ ని ప్లాన్ చేసుకోలేకపోయారు. అవకాశాలతో పాటు సక్సెస్ ని స్టార్ డమ్ ని తెచ్చుకున్నాక కూడా చిరంజీవి ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు లేదు.

చిరంజీవి గొప్పతనాన్ని అతని స్నేహితులను అడిగితే ఈ విధంగా చెప్పారు. చిరంజీవి కెరీర్ ప్రారంభంలో ఒకే రూమ్ లో ఉన్న సుధాకర్,హరిప్రసాద్ చిరంజీవికి మంచి స్నేహితులు. వీరికి నారాయణ కూడా ఆప్త మిత్రుడు. వీరందరూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఒకేచోట ఉండేవారు.

నారాయణ మాట్లాడుతూ చిరంజీవి మా ముగ్గురితో (నారాయణ,హరిప్రసాద్,సుధాకర్) డైనమిక్ మూవీ మేకర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ని ఏర్పాటు చేయించాడు. ఆ బేనర్ పై 1988 లో యముడికి మొగుడు సినిమాను తీశారు. ఈ సినిమాకి లక్షల్లో బడ్జెట్ పెడితే కోటి ఇరవై లక్షలు వసూలు చేసింది.

ఈ సినిమా చిరుకి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. చిరంజీవి ముగ్గురు స్నేహితులు ఆ బేనర్ పై తీసిన ఏ సినిమా ఫెయిల్ అవ్వలేదు. అయితే ఈ బేనర్ లో చిరుతో మరొక సినిమా చేయలేదు.

ఇక సుధాకర్ మాట్లాడుతూ రూమ్ లో చిరంజీవి అన్నం వండేవాడని,తాను కూరలు చేసేవాడినని, మార్కెట్ నుంచి కావలసినవి హరిప్రసాద్ తెచ్చేవాడని చెప్పారు. ఎదో ఒక రోజు స్టార్ డమ్ వస్తుందని ఉహించమని అన్నాడు. చిరంజీవి తెలుగు సినిమాల్లో బిజీ అవగా తాను తమిళ సినిమా రంగం వైపు వెళ్లి అక్కడ బిజీ అయ్యానని సుధాకర్ తెలిపాడు. హరిప్రసాద్ ఆ మధ్య చనిపోయాడు.

మరి మీరందరు కలుస్తారా అని అడిగితే చిరంజీవి ఇప్పటికి మాతో స్నేహంగా మాట్లాడతాడని,అయితే చిరు స్టార్ డమ్ దృష్ట్యా మేమె కాస్త దూరంగా ఉంటున్నామని చెప్పారు.