సావిత్రి నిజ స్వరూపం బయట పెట్టిన జెమిని గణేష్ కూతురు
మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తీసిన మహానటి సినిమా ఎంతటి ప్రజాదరణ పొందిందో మనకు తెలిసిన విషయమే. అంతేకాక హిట్ టాక్ తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీని సృష్టిస్తుంది. మహానటి సినిమా గురించి జెమిని గణేష్ కూతురు కమల సెల్వరాజ్ షాకింగ్ కామెంట్స్ చేసారు. మహానటి సినిమాలో తన తండ్రి పాత్రను చిత్రీకరించిన తీరు వేదన కలిగిస్తుందని కమల సెల్వరాజ్ అన్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో MGR, శివాజీ గణేశన్ లతో పాటు తన తండ్రి జెమిని గణేష్ కూడా అగ్రహీరో అన్న విషయం అందరికి తెలుసునని అన్నారు. అలాంటి వ్యక్తి పాత్రను సోమరిపోతుగా,చిన్న చిన్న పనులు చేసే వ్యక్తిగానూ కించపరిచే విధంగా చిత్రీకరణ చేసారని ఆరోపించారు.
ఒక తమిళ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ సావిత్రికి మద్యం అలవాటు చేసింది నాన్నే అంటూ చూపించటం చాలా బాధించిందని అన్నారు. సావిత్రితో నటించిన పెద్ద పెద్ద నటులు అంతా ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేయటానికి రాలేదని చూపటం వాస్తవం కాదన్నారు.
సినిమా నిర్మాణం చేయవద్దని చెప్పటానికి ఆమె ఇంటికి నాన్న వెళ్ళినప్పుడు నేను ఉన్నానని , వాచ్ మెన్ చేత గెంటించారని కమల సెల్వరాజ్ అన్నారు.