Movies

బయట పడ్డ ఉదయ్ కిరణ్ ఆస్తులు… ఉదయ్ కిరణ్ అన్నయ్య ఎలా చనిపోయాడు

టాలీవుడ్ లో ఉదయ్ కిరణ్ వంటి హీరో ఎప్పటికి రాడు. ఎంతో అందంగా,అమాయకంగా కనిపించే ఉదయ్ కిరణ్ నిజ జేవితంలో ఎంతో సున్నిత మనస్సు కలిగిన వాడు. ఏ కొత్త హీరోకి రానంత పేరు ప్రతిష్టలు,క్రేజ్,ఊహించని రెమ్యునరేషన్ ఉదయ్ కిరణ్ ని స్టార్ హీరోగా మార్చాయి. అయితే ఉదయ్ కిరణ్ జీవితం ఒక సంఘటనతో తారుమారు అయిందనే చెప్పాలి. చిరంజీవి కూతురుతో నిశ్చితార్ధం క్యాన్సిల్ అయ్యాక ఉదయ్ కిరణ్ జీవితంలో బ్యాడ్ రోజులు ప్రారంభం అయ్యాయి. సరైన అవకాశాలు రాకపోవటం, చేసిన సినిమాలు ప్లాప్ అవ్వటం,పెళ్లి చేసుకున్న మారని పరిస్థితులు ఉదయ్ కిరణ్ ని మానసికంగా దెబ్బతిశాయి. ఆ తర్వాత ఏమి జరిగిందో మనకు తెలిసిన విషయమే.

కుటుంబ సభ్యులను,అభిమానులను తీవ్ర వేదనకు గురి చేస్తూ తన నివాసంలో ఆత్మహత్య చేసుకొని మరణించాడు. అయితే ఉదయ్ కిరణ్ కి ముందే ఉదయ్ కిరణ్ అన్నయ్య కూడా ఇదే రీతిలో చనిపోయాడని చాలా మందికి తెలియదు. మస్కట్ లో ఉండే ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పారు.

తల్లి చనిపోయిన తర్వాత తమ కుటుంబం చిన్నాభిన్నం అయిందని… ఉదయ్ కిరణ్ కి ముందు తన అన్నయ్య ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పింది. అతను పెద్ద మేధావి అని సమాజంలో జరిగే సంఘటనలకు చలించిపోయేవాడని… ఎవరికీ ఏ అన్యాయం జరిగినతట్టు కోలేక పోయేవాడని… ఇలాంటి లోకంలో జీవించటం కంటే హిమాలయాల్లో జీవించటం బెటర్ అని భావించేవాడని చెప్పింది.

అయితే ఉన్నట్టు ఉండి డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపింది. అన్నయ్య బాటలోనే ఉదయ్ కిరణ్ కూడా ఆత్మహత్య చేసుకోవటం మమ్మల్ని ఎంతగానో బాధకు గురి చేసిందని శ్రీదేవి చెప్పుతూ… తల్లిని,అన్నయ్యను,తమ్ముడిని కోల్పోయి తాను ఒంటరి అయ్యిపోయానని కంట తడి పెట్టింది.

ఉదయ్ కిరణ్ చివరి రోజుల్లో ఆర్ధిక ఇబ్బందులు పడ్డాడని కథనాలు చాలా వచ్చాయని వాటిలో ఏమాత్రం నిజం లేదని…సినిమాలు లేకపోయినా దర్జాగా బ్రతికేంత ఆస్థి తమ్ముడు పేర ఉందని శ్రీదేవి చెప్పారు. ల్యాండ్స్,బంగారం చాలా ఉందని ఉదయ్ కిరణ్ మరణానికి డబ్బు కారణం కాదని చెప్పింది.