ఆఫీసర్ హీరోయిన్ ఎవరి కూతురు? ఆఫీసర్ సినిమా విడుదల అయ్యాక బయట పడ్డ నిజం
టాలీవుడ్ మన్మధుడు హీరోగా సంచలన దర్శకుడు రామ్ గోపాల వర్మ దర్శకత్వంలో వచ్చిన ఆఫీసర్ సినిమా కర్ణాటకకి చెందిన IPS ఆఫీసర్ ప్రసన్న జీవితం ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమాలో నాగార్జున సరసన కొత్త అమ్మాయి మైరా సరీన్ నటించింది. ఈ సినిమాలో పాటలు లేకపోయినా నాగార్జునతో యాక్షన్ సన్నివేశాలలో చాలా బాగా నటించింది. ఈ సినిమా ఆమెకు మొదటి సినిమా అంటే ఎవరు నమ్మరు. అంత బాగా నటించింది. ఆఫీసర్ సినిమా ఈ రోజు ప్రేక్షుకుల ముందుకు వచ్చింది. నాగార్జున ఆఫీసర్ సినిమాకి కమిట్ అయ్యాక చాలా మంది హీరోయిన్స్ ని అనుకున్నారు. అయితే ఆ అదృష్టం మైరా సరీన్ ని వరించింది.
ఆఫీసర్ సినిమాలో హీరోయిన్ గా టబు,అనుష్క పేర్లు వినిపించినా వర్మ మైరా సరీన్ పేరు ఎనౌన్స్ చేసి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. నాగార్జునతో సినిమా చేసినప్పుడు ఒక కొత్త అమ్మాయిని హీరోయిన్ గా తీసుకురావటం అంటే సాహసమనే చెప్పాలి. ఆ సాహసం వర్మ చేసాడు.
అయితే మైరా సరీన్ ఎవరా అని అందరిలోనూ సందేహము మొదలైంది. ఆమె ఎవరు? ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? అంటూ అందరికి సందేహాలు మొదలు అయ్యాయి. మైరా సరీన్ మోడలింగ్ రంగం నుండి వచ్చింది. ఆమె కుటుంబానికి సినిమా రంగానికి పెద్దగా సంబంధాలు లేవు.
మైరా సరీన్ తల్లితండ్రులు హర్యానాకి చెందిన వారు. మైరా సరీన్ కి చిన్నప్పటి నుండి నటి కావాలని కోరిక ఉంది. దాంతో సినిమాల్లోకి రావాలంటే మోడలింగ్ లోకి వెళ్లాలని నిర్ణయించుకొని ముంబై కి చేరింది. చిన్న చిన్న బ్రాండ్స్ కి మోడలింగ్ చేస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది.
ఆఫీసర్ సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలుసుకొని మైరా సరీన్ తన ఫోర్ట్ ఫోలియా పంపిందట. కొన్ని వందల మంది నుంచి ఈ హర్యానా బ్యూటీని వర్మ ఎంపిక చేసాడట. ఆలా ఆఫీసర్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. మైరా సరీన్ మరొకసారి నాగార్జునతో అవకాశం వస్తే నటించటానికి సిద్ధంగా ఉందట.