కొరియోగ్రాఫర్ గా దుమ్ము దులిపేస్తున్న ఈమె ఒకప్పుడు మంచి హీరోయిన్ అని తెలుసా…
గాయత్రీ రఘురాం ఉరఫ్ దీక్షా రఘురాం గుర్తుందా…. ఒకప్పటి హీరోయిన్ , ఇప్పటి డాన్స్ కొరియోగ్రాఫర్ . అప్పట్లో కేవలం రెండు సినిమాల్లో మాత్రమే నటించింది . కానీ ప్రేక్షకుల గుండెల్లో ఒక చెరగని ముద్ర వేసుకుంది. ‘మా బాపు బొమ్మకు పెళ్ళంటా’ లో గాయత్రీ రఘురాంగా, రేపల్లి ,రాధా సినిమాల్లో దీక్షా రఘురాంగా నటించిన ఈమె ఒకప్పటి డాన్స్ డైరెక్టర్ రఘురాం పెద్ద కూతురు. ఈమె సినిమాల్లోకి వచ్చి పేరు తెచ్చుకొనే సమయానికి కనుమరుగు అయ్యిపోయింది. 2001 లో తెలుగు తెరకు పరిచయం అయిన గాయత్రీ రఘురాం తమిళ అమ్మాయి. తమిళంలో చార్లీ చాప్లిన్,కన్నడ,మలయాళంలలో కూడా మంచి పేరు తెచ్చుకుంది. 2006 నుంచి సినిమాలు తగ్గించేసి దీపక్ చంద్ర శేఖర్ అనే కంప్యూటర్ ఇంజనీర్ ని పెళ్లి చేసుకొని అమెరికాకు వెళ్ళిపోయింది.
అప్పట్లో తమిళనాడులో జరిగిన పెళ్లిళ్లలో గాయత్రీ రఘురాం పెళ్లి గ్రాండ్ మేరేజ్ అని చెప్పుతారు. కేవలం 5 సంవత్సరాలు మాత్రమే నటించి కెరీర్ కి గుడ్ బై చెప్పేసింది. అయితే ఆ తర్వాత ఆమె జీవితం మలుపు తిరిగింది.
2008 లో ఇండియాకు వచ్చిన గాయత్రీ రఘురాంకి ఆమె భర్త విడాకుల నోటీసు ఇచ్చాడు. ఆమె షాక్ అయ్యి భర్తని కన్విన్స్ చేయటానికి ప్రయత్నం చేసిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీనితో మళ్ళీ సినిమాల్లోకి రావలసిన పరిస్థితి ఏర్పడింది.
ఈ లోపు తండ్రి మరణించటంతో గాయత్రీ రఘురాం తన తండ్రి బాటలో నడవాలని నిర్ణయం తీసుకోని మంచి డాన్స్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకుంది. ఈ పది సంవత్సరాలలో గాయత్రీ రఘురాం వందకు పైగా సినిమాలకు కొరియోగ్రఫీ చేసింది.
ఈ మూడు సంవత్సరాలలో 35 పాటలకు నృత్య దర్శకత్వం వహించి చాలా బిజీగా ఉంది. మల్లన్న సినిమాలో ‘ఎక్స్ క్యూజ్ మీ మల్లన్న’ పాటకు డాన్స్ కంపోజ్ చేసింది. ఇలాంటి హిట్ పాటలు ఆమె ఖాతాలో చాలానే ఉన్నాయి.
తమిళ బిగ్ బాస్ లో కూడా పార్టిసిపేట్ చేసింది. బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసినందుకు ఆమెకు వారానికి రెండు లక్షల పారితోషికాన్ని ఇచ్చినట్టు టాక్. గాయత్రీ రఘురాం సినిమాల ద్వారా దాదాపుగా 30 కోట్ల వరకు సంపాదించి ఉండవచ్చని సమాచారం. ఇంత సాధించిన గాయత్రీ రఘురాం వయస్సు కేవలం 34 సంవత్సరాలు మాత్రమే.