Movies

ఈ నిర్మా పాప ఎవరో తెలిస్తే షాక్ అవుతారు?

ఆకట్టుకొనే అందంతో పాటు కళ్ళతోనే భావాలను పలికించే వారికి గ్లామర్ రంగంలో మంచి అవకాశాలు ఉంటాయి. చిన్నతనంలో మోడల్ గా రాణించి పెద్దయ్యాక హీరోయిన్ గా సక్సెస్ అయినవారు చాలా అరుదుగా ఉంటారు. దానికి ఉదాహరణగా I LOVE YOU RASNA అంటూ అందరిని మురిపించిన అంకిత. పెద్దయ్యాక గ్లామర్ హీరోయిన్ గా బాగా రాణించింది. ఇప్పుడు అదే దారిలో వెళ్ళుతుంది నిర్మా పాప. ఆ నాడు వాషింగ్ పౌడర్ నిర్మా యాడ్ ఎంత పాపులర్ అయిందో, ఆ యాడ్ లో తెల్లని ఫ్రాక్ వేసుకొని ఉన్న అందాల పాప కూడా అంతే పాపులర్ అయింది. ఆ చిన్న పాప పేరు స్వరా భాస్కర్. ఈమె ఇప్పుడు బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది.

నిర్మా వాషింగ్ పౌడర్ యజమాని చిత్రపు ఉదయ్ భాస్కర్ కూతురు ఈ స్వరా భాస్కర్. తల్లి ఐరా భాస్కర్ బీహార్ కి చెందిన ప్రొఫెసర్. ఢిల్లీలో పుట్టి పెరిగిన స్వరా LKG నుంచి PG వరకు అక్కడే చదివింది.

చిన్నతనం నుండే యాక్టింగ్ మీద ఆసక్తి ఉన్న స్వరా 2009 లో మోడలింగ్ రంగంలో అడుగు పెట్టింది. అప్పటి నుంచి ఈ భామకు బాలీవుడ్ లో వరుస సినీ అవకాశాలు క్యూ కట్టాయి. అయితే రీసెంట్ గా విడుదల అయినా Veere di wedding సినిమా ప్రమోషన్స్ లో అచ్చు తన చిన్నప్పుడు నిర్మా యాడ్ లో వేసుకున్న డ్రెస్ వేసుకొని అందర్ని ఆకట్టుకుంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.