Movies

హీరోయిన్ రక్షిత తల్లితండ్రులు పెద్ద స్టార్స్… ఎవరో తెలుసా?

తెలుగు సినీ చరిత్రలో ఇడియట్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. పూరి జగన్నాథ్,రవితేజ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాలో కొత్త హీరోయిన్ ని లాంచ్ చేసాడు పూరి. రవితేజ కెరీర్ కి బ్రేక్ ఇచ్చిన ఈ సినిమాతో రక్షిత టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. అయితే కన్నడ సినిమా అప్పు లో హీరోయిన్ గా చేసింది. అదే సినిమాను తెలుగులో ఇడియట్ గా తీశారు. కన్నడలో నటించిన రక్షితనే ఇడియట్ లో హీరోయిన్ గా తీసుకున్నాడు పూరీ. ఇడియట్ సినిమా హిట్ అవ్వటంతో పెళ్ళాం ఊరెళ్ళితే,నిజం,శివమణి వంటి సినిమాల్లో నటించి స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. ఆంద్రావాలా,అందరివాడు వంటి సినిమాలతో పెద్ద హీరోల సరసన కూడా నటించగలనని చేసి చూపింది ఈ కన్నడ భామ.

టాలీవుడ్ లో మంచి పొజిషన్ లో ఉన్న సమయంలో తండ్రి గౌరీ శంకర్ మరణం ఆమెను నిరాశలోకి నెట్టేసింది. దాంతో కొంతకాలం ఇంటికే పరిమితం అయ్యిపోయింది. తెలుగులో కాస్త అవకాశాలు తగ్గగానే తన మాతృబాష అయినా కన్నడ వైపు దృష్టి సారించింది.

కన్నడలో కొన్ని సినిమాలు చేసాక రక్షిత దర్శకుడు ప్రేమ్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది. సినిమాలకు దూరం అయినా సరే టెలివిజన్ షోల ద్వారా అభిమానులకు దగ్గరగానే ఉంది.

రక్షిత అసలు పేరు శ్వేత. ఆమె 1984 బెంగుళూర్ లో జన్మించింది. తల్లితండ్రులు ఇద్దరూ సినీ రంగానికి చెందిన వారు కావటంతో మొదటి నుంచి రక్షితకు సినిమాలలో నటించాలనే ఆసక్తి ఉంది.

రక్షిత తండ్రి గౌరీ శంకర్ కన్నడ పరిశ్రమలో ఫెమస్ కెమెరా మెన్ గా పేరు పొందారు. అయన చాలా మంది హీరోల హిట్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసారు. అయన కెరీర్ లో కర్ణాటక ప్రభుత్వం నుండి 6 సార్లు ఉత్తమ కెమెరా మెన్ అవార్డు ని అందుకున్నారు.

ఇక రక్షిత తల్లి పేరు మమతారావు. ఆమె కూడా సినిమా హీరోయిన్ కావటం విశేషమనే చెప్పాలి. రక్షిత చదువు పూర్తి కాగానే తల్లితండ్రుల బాటలో సినీ రంగాన్ని ఎంచుకుంది. ప్రసుతం భర్త,పిల్లలతో జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ రాజకీయాల్లో బిజీగా ఉంది రక్షిత. ప్రస్తుతం రక్షిత బీజేపీ లో ఉంది.