సునీల్ కి ఘోర అవమానం…రోజుకీ ఎంత ఇస్తున్నారో తెలిస్తే షాక్ అవుతారు
ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా ఒక వెలుగు వెలిగిన సునీల్ ఆ తర్వాత హీరోగా మారాడు. హీరోగా సక్సెస్ రావటంతో కమెడియన్ గా మానేసి కేవలం హీరోగానే చేస్తున్నాడు. వరుస పరాజయాలు రావటంతో కొంత కాలం హీరోగా చేయాలా లేదా కమెడియన్ గా చేయాలా అనే సందిగ్ధంలో పడ్డాడు. అయితే ఎట్టకేలకు ఆ డైలమా నుండి బయట పడి మళ్ళీ కమెడియన్ గా చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ మధ్య వచ్చిన ఉంగరాల రాంబాబు,టూ కంట్రీస్ సినిమాలు డిజాస్టర్ అవ్వటంతో హీరో పాత్రల జోలికి వెళ్లకుండా కమెడియన్ గా చేయాలని నిర్ణయానికి వచ్చాడు సునీల్.
ప్రస్తుతం సునీల్ కమెడియన్ గా మూడు సినిమాలకు సైన్ చేసినట్టు సమాచారం.
త్రివిక్రమ్,ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో సునీల్ కి త్రివిక్రమ్ మంచి రోల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత శ్రీను వైట్ల,హను రాఘవపూడి సినిమాలలో నటిస్తున్నాడు. చిన్న దర్శకులతో సినిమాలు చేసి ప్లాప్ టాక్ తెచ్చుకున్నాడు సునీల్.
ఇప్పుడు పెద్ద దర్శకుల సినిమాల్లో కమెడియన్ గా నటించి ఒక హిట్ కొట్టాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు. సునీల్ హీరో నుండి కమెడియన్ గా మారాక సినిమా బట్టి రెమ్యూనరేషన్ ఇవవటం లేదట నిర్మాతలు. త్రివిక్రమ్ సినిమాలో సునీల్ కి రోజుకి 4 లక్షల రూపాయిలను ఇస్తున్నారట.
ఇక మిగతా సినిమాలకు కూడా పారితోషికం దాదాపుగా ఇంతే ఉంటుందని అంటున్నారు. తెలుగులో బ్రహ్మానందం రోజుకి 5 లక్షలు తీసుకునేవాడు. ప్రస్తుతం బ్రహ్మానందంకి పెద్దగా అవకాశాలు రావటం లేదు. కాబట్టి ఈ సమయంలో సునీల్ మంచి ఛాన్స్ లను పట్టుకోవచ్చు.