పతంజలి యోగ సూత్రాలు.
పతంజలి యోగసూత్రాలు అనేది నాలుగు అధ్యాయములు గా విభజింపబడినది. సమాధిపద, సాధనపద, విభూతిపద, కైవల్యపద అనేవి ఈ నాలుగు అధ్యాయాలు. ఇవి మానసిక శుద్ధి, పరిపూర్ణత్వం కు సంబంధించిన అధ్యాయాలు.
1. సమాధిపద:
స్థిర చిత్తం లేమి, చంచల మనస్తత్వం లను అధిగమించి, మానసిక శుద్ధి కలిగించి, మనసును నియంత్రణ లో ఉంచే స్థితి సాధనలను గూర్చి ఈ అధ్యాయం లో వివరించబడినది.
2. సాధనపద:
సాధన… సాధన చేయడం. మానసిక బాధలను గుర్తించి, వాటిని తొలగించే పద్ధతులు తో ప్రారంభమయ్యే ఈ అధ్యాయం ఆత్మజ్ఞానం దిశగా మళ్ళిస్తుంది.
3.విభూతిపద:
అంతర్లీన శోధనలో అలౌకిక భావనలో లీనమయ్యే స్థితి దిశగా ఈ అధ్యాయం లోని సాధనలు వివరిస్తాయి.
4. కైవల్యపద:
ఆఖరి గమ్యమైన కైవల్య సాధన. అంతిమమైన విమోచనాస్థాయి ని అంతర్దృష్టి తో వీక్షించే సాధనలు ఈ అధ్యాయం లో వివరించబడతాయి. కర్మ గురించి ఈ అధ్యాయం లో పేర్కొనబడినది.
వాస్తవిక ప్రస్తుత వర్తమాన స్థితి ద్వారా, గతము, భవిష్యత్తు లతో ఉన్న సంబంధాల విశ్లేషణ, జ్ఞానం గూర్చి కూడా ఈ అధ్యాయం లో వివరించబడినది.మానవుని చైతన్యాన్ని ని దైవత్వం దిశగా పరిపూర్ణ స్థాయికి మళ్లించే సంపూర్ణ ప్రక్రియ ఈ యోగ.