Health

పవర్ యోగాలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసా?

పవర్ యోగా చేయటం వలన మానసికంగానూ,శారీరకంగానూ రిలాక్స్ గా ఉంటారు. ఈ మధ్య కాలంలో పవర్ యోగా చేసే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఈ యోగా చేయటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ ప్రయోజనాల గురించి తెలుసుకుంటే మీరు కూడా ఈ రోజు నుంచే పవర్ యోగా చేయటం ప్రారంభిస్తారు. ఇపుడు పవర్ యోగా ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. బరువు తగ్గటానికి పవర్ యోగాకు మించినది ఏది లేదు. పవర్ యోగా చేసినప్పుడు శరీరంలో అన్ని భాగాలు కదలటం వలన తొందరగా బరువు తగ్గుతారు.

పవర్ యోగా చేయటం వలన శరీరంలో మెటబాలిజం రేటు పెరిగి తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యి అన్ని క్రియలు సక్రమంగా జరుగుతాయి.
పవర్ యోగా చేయటం వలన బ్లడ్ సర్కులేషన్ బాగా పెరుగుతుంది. దాంతో శరీర రక్తప్రసరణ పెరిగి గుండె వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అలాగే రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.

పవర్ యోగాను క్రమం తప్పకుండా చేస్తే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దాంతో అనేక రకాల ఇన్ ఫెక్షన్స్ రాకుండా శరీరాన్ని కాపాడుతుంది. మరో ముఖ్య విషయం ఏమిటంటే ఒత్తిడి తగ్గి ప్రశాంతత వస్తుంది. మానసికంగా చాలా ఆహ్లాదకరంగా ఉంటారు.