“యోగ”.. విశ్వవ్యాప్తంగా జనాదరణ.
ఇతర వ్యాయామాలు శారీరక ధారుడ్యం మాత్రమే మెరుగుపరుస్తాయి. కానీ యోగా లోని ధ్యానం, ప్రాణాయామం వంటి ప్రక్రియలు, మానసిక ఆరోగ్యం,ఏకాగ్రత, స్థిరచిత్తం, ప్రశాంతత వగైరాలకు కారణమౌతాయి. ఆధ్యాత్మిక చైతన్యం కలుగచేస్తాయి. ఈ విధంగా మానసిక ఒత్తిడులు వలన వచ్చే శారీరక అనారోగ్యాలకు దూరం అవడం జరుగుతుంది. మామూలు వ్యాయామాలకు, యోగా కు మధ్య ఉన్న ఈ తేడానే, యోగా విశ్వవ్యాప్తం అవడానికి కారణమైంది.బౌద్ధమతం యోగాను కేంద్రీకృతం చేసుకుని ఉంది. బౌద్దులు యోగశాస్త్ర లోతులు చూడడానికి ప్రయత్నిస్తారు. ఇక తాంత్రికులు కుండలినీ ఉపాసన వగైరాలు చేస్తారు.
అలానే మలేషియాలో.., ముస్లిం లు ఎటువంటి మంత్రాలు పఠించకుండా యోగా చేసుకోవచ్చని ఫత్వా జారీ చేశారు. యోగా చేసే క్రైస్తవులూ ఉన్నారు. ఇలా .., ప్రపంచవ్యాప్తంగా జాతి, మత, లింగ బేధాలు లేకుండా యోగాను ఆదరిస్తున్నారు, ఆచరిస్తున్నారు, యోగాను తమ దైనందిన జీవితం లో భాగం గా చేసుకున్నారు.