Movies

నీకు వయస్సు అయ్యిపోయింది కదా అని ఒక అభిమాని అంటే… అనసూయ ఏముందో తెలుసా?

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినషన్ లో వచ్చిన రంగస్థలం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామిని సృష్టించింది. చెవిటి అబ్బాయిగా రామ్ చరణ్ అదిరిపోయే నటనతో అందరిని ఆకట్టుకున్నాడు. ఇక రంగమ్మత్త పాత్రలో అనసూయ అందరి మనస్సులను దోచింది. అనసూయ నటనకు అందరు ఫిదా అయ్యిపోయారు. సినిమా ప్రారంభానికి ముందు రామ్ చరణ్ కి అత్తగా నటించటానికి నిరాకరించిన అనసూయ, చివరకు సుకుమార్ చెప్పిన కథ నచ్చటంతో ఒప్పుకుంది. రంగమ్మత్త పాత్ర బాగా హిట్ కావటంతో మరిన్ని అముఞ్చి పాత్రలను చేయటానికి సిద్ధం అవుతుంది అనసూయ. ఈ నేపథ్యంలో అనసూయ ట్వీటర్ లో చాలా కాలం తర్వాత చాలా యాక్టివ్ గా కన్పించింది.

అప్పట్లో ఒక బాలుడి దగ్గర సెల్ ఫోన్ బద్దలు కొట్టినందుకు విమర్శలు రావటంతో అప్పటి నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉంది. నిన్న ట్విట్టర్ వేదికగా అనసూయ అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు చాలా ఆసక్తికరంగా స్పందించింది.

మేడం మీరు రంగస్థలం సినిమాలో వయస్సుకు మించిన రంగమ్మత్త పాత్ర వేశారు కదా మీరు ఇబ్బంది పడలేదా అని ఒక అభిమాని అడిగాడు. దీనికి అనసూయ స్పందిస్తూ రంగమ్మత్తగా ఎందుకు చేయవలసి వచ్చిందో వివరణ ఇచ్చింది.

నిజం చెప్పాలంటే రంగమ్మత్తగా చేయటానికి మొదటి ఇబ్బంది పడ్డాను. అయితే ఒకసారి ఒప్పుకున్నాక వెనుదిరిగి చూసే టైప్ కాదు నేను. డబ్బింగ్ చెప్పేటప్పుడు అవుట్ ఫుట్ చూసాక మంచి పాత్ర చేసానని అర్ధం అయిందని చెప్పింది.

అనసూయ తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంది. తన ఎదుగుదలకు తన కుటుంబ ప్రోత్సహం చాలా ఉందని,వారు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు కాబట్టే నా కెరీర్ ఇంత సక్సెస్ గా సాగుతుందని చెప్పుకొచ్చింది.