ఎన్టీఆర్ ఇంటిలో సంబరాలు జరుగుతూ ఉంటె… కళ్యాణ్ రామ్ ఇంటిలో ఏమి జరిగిందో తెలిస్తే షాక్
నిన్న నందమూరి కుటుంబానికి మర్చిపోలేని రోజు అవుతుందంటే దానిలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ లకు డబుల్ శుభవార్త అవుతుంది. నిన్న ఎన్టీఆర్ ఇంటిలో ఒకటి,కళ్యాణ్ రామ్ ఇంటిలో ఒకటి… అవి ఏమిటంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య నిన్న బాబుకి జన్మనిచ్చింది. ఎన్టీఆర్,ప్రణతిలకు మొదట అభయ్ రామ్ పుట్టాడు. అభయ్ రామ్ కి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు. ఇప్పుడు మరల అబ్బాయి పుట్టాడు. ఎన్టీఆర్ ఈ విషయాన్నీ ట్విట్టర్ ద్వారా తెలియజేసాడు. మా కుటుంబం పెద్దది అయింది. నా జీవితంలోకి మరో అబ్బాయి వచ్చాడని ఎన్టీఆర్ ట్వీట్ చేసాడు. దాంతో ఎన్టీఆర్ కి శుభాకాంక్షల వాన మొదలైంది.
ఇక రెండో శుభవార్త ఏమిటంటే…చాలా రోజుల నుంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న కళ్యాణ్ రామ్ కి నా నువ్వే తో మంచి హిట్ దక్కింది. భారీ అంచనాలతో నిన్న విడుదల అయినా నా నువ్వే పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకుపోవడంతో అప్పుడే కళ్యాణ్ రామ్ ఇంటిలో సక్సెస్ పార్టీల సందడి మొదలైంది.
అన్నదమ్ములకు ఒకే రోజు రెండు శుభవార్తలు రావటం నందమూరి అభిమానులకు మంచి జోష్ ని తెచ్చిపెట్టింది. తమ్ముడికి కొడుకు పుట్టటంతో కళ్యాణ్ రామ్ విషెస్ చెప్పటం,అన్న హిట్ కొట్టినందుకు తమ్ముడు ఎన్టీఆర్ ప్రశంసించటం…ఇలా నిన్న అన్నదమ్ములు ఇద్దరూ చాలా హ్యాపీగా ఉన్నారు.