ప్రభాస్ ఇంటిలో ఇప్పుడు ఏమి జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు
టాలీవుడ్ లో బాహుబలి సినిమాలతో వరుస రెండు భారీ విజయాలను సొంతం చేసుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమాతో బిజీగా ఉన్నాడు. బాహుబలి సినిమాతో ప్రభాస్ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. బాహుబలి రెండు భాగాలు పూర్తీ అయ్యేసరికి ప్రభాస్,అనుష్క మధ్య అనుబంధం బాగా బలపడిందనే వార్తలు షికారు చేస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే ప్రభాస్,అనుష్క ఇద్దరూ ఒకరి సినిమా షూటింగ్ మరొకరు వెళ్లటంతో వాతావరణం మరింత వేడెక్కింది. ఇదే సమయంలో ప్రభాస్,అనుష్క ఇంటిలో పెళ్లి సంబంధాలు చూస్తున్నారంటూ కథనాలు బయలుదేరాయి. అవి నిజమే అన్నట్టుగా అనుష్క ఈ మధ్య హిమాలయాల ప్రాంతాలలో ఉన్న శక్తివంతమైన దేవాలయాలను సందర్శించి వచ్చింది. పెళ్ళికి ముందు కొన్ని దోషాలను తొలగించుకోవడానికి అనుష్క కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయాలకు వెళుతుందని సోషల్ మీడియాలో విస్తుతంగా ప్రచారం జరుగుతుంది.
ఈ నేపథ్యంలో ప్రభాస్ కి సంబంధించి కొంత ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. ప్రభాస్ కి 2018 చివరికి ఏమైనా సరే పెళ్లి చేసేయాలని గట్టిగా డిసైడ్ అయ్యారట. ప్రభాస్ ని అమ్మాయిని ఒకే చేస్తే మిగతా పనులను చేయటానికి కృష్ణంరాజు సిద్ధంగా ఉన్నాడట.
ఇప్పటికే కొంత మంది అమ్మాయిలను సెలక్ట్ చేసి అందులో నచ్చిన అమ్మాయిని సెలక్ట్ చేసుకోమని కృష్ణంరాజు ప్రభాస్ మీద ఒత్తిడి తెస్తున్నాడట. ఇప్పటివరకు ఏ కారణం లేకుండా పెళ్లి చేసుకోకపోవటంపై ప్రభాస్ ని మందలించారట కృషంరాజు.
ప్రస్తుతం ప్రభాస్ ఇంటిలో కొన్ని ప్రత్యేకమైన పూజలను జరిపిస్తున్నట్టు ఫిలిం నగర్ లో వినిపిస్తుంది. ప్రభాస్ జాతకాన్ని ప్రఖ్యాత జ్యోతిష్కులకు కుటుంబ సభ్యులు చూపించగా కొన్ని పూజలు చేయించమని చెప్పగా ఆ పూజలను చేయిస్తున్నారట.
ప్రభాస్ కి ఇంతకాలం పెళ్లి కాకపోవడానికి అతని జన్మ నక్షత్రం కారణమని చెప్పి పూజలు,హోమాలు చేయమని చెప్పారట. కోనసీమకు చెందిన జ్యోతిష్యుడు చెప్పిన ప్రకారం ఫాలో అవుతున్నారట. కుటుంబ సభ్యుల తీరు చూస్తూ ఉంటే ప్రభాస్ కి పెళ్లి చేయటానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో అనిపిస్తుంది.