Movies

సైరా సినిమాపై చిరంజీవి సంచలన నిర్ణయం…. షాక్ లో సురేంద్రరెడ్డి,రామ్ చరణ్

దాదాపుగా 9 సంవత్సరాల గ్యాప్ తర్వాత చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాలో నటించి హిట్ కొట్టాడు. అయినా చిరు సంతృప్తి చెందలేదు. అందుకే చిరు తన తర్వాతి సినిమాను చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు. ఆ సినిమానే సైరా నరసింహారెడ్డి. ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఒక హాట్ న్యూస్ ఫిలిం నగర్ లో హల్ చల్ చేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతుంది. 40 రోజుల పాటు నైట్ ఎఫెక్ట్ తో తెరకెక్కుతున్నటు సమాచారం. ప్రస్తుతం చిరంజీవి సైరా సినిమాతో పెద్ద సాహసమే చేస్తున్నాడని చెప్పాలి. 200 కోట్ల భారీ బడ్జెట్ తో సొంత బేనర్ లో తీస్తున్నాడు. ప్రస్తుతం చిరంజీవి మీద యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

మరో పక్క ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ ని ఎప్పుడు విడుదల చేయాలా అనే విషయంలో డైరెక్టర్ సురేంద్రరెడ్డి, నిర్మాత రామ్ చరణ్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. చిరంజీవి పుట్టినరోజు ఫస్ట్ లుక్ ని విడుదల చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు. అయితే సినిమా షూటింగ్ జరిగే కొద్దీ సినిమాపై నమ్మకం తగ్గిపోతుందట చిరంజీవికి.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ నాటి కాలంలో దొంగ అని కొంతమంది చరిత్రకారులు చెప్పుతున్నారు. మరి కొంతమంది బ్రిటిష్ వారిని ఎదిరించిన స్వతంత్ర సమరయోధుడు అని అంటున్నారు. కథ విషయంలో తర్జన భర్జన పడిన పరుచూరి బ్రదర్స్ క్లైమాక్స్ ని సరిగా డిజైన్ చేయలేదని ఒక టాక్ విన్పిస్తుంది. సినిమా చివరిలో బ్రిటిష్ వారు నరసింహారెడ్డి కుటుంబ సభ్యులను బందించి నరసింహారెడ్డిని దొంగదెబ్బ తీసి చంపేస్తారట.

ఆ తర్వాత అతని తలను కోట గుమ్మానికి వ్రేలాడదీసారనేది కథ. చిరంజీవి వంటి స్టార్ హీరోని బ్రిటిష్ వారు చంపటం,తలను కోట గుమ్మానికి వ్రేలాడతీయటం అంటే చిరు అభిమానులు తట్టుకోలేరు. దాంతో క్లైమాక్స్ ని ఎలా డీల్ చేయాలా అనే ఆలోచనలో పడ్డారట. ఇక క్లైమాక్స్ విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదట.