Movies

ముంబాయిలో గంటకు లక్ష ఖర్చు చేస్తున్న మహేష్ బాబు….ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టి ఆ సక్సెస్ ని కుటుంబంతో ఎంజాయ్ చేయటానికి స్పెయిన్, ఫ్రాన్స్ దేశాలు వెళ్లి వచ్చాడు. కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే మహేష్ బాబు వర్క్ విషయంలో ఎక్కడ రాజీకి రాకుండా హార్డ్ వర్క్ చేస్తాడు. ఎంత కష్టమైన తాను కమిట్ అయినా సినిమాకు 100 శాతం న్యాయం చేస్తాడు. దాంతో మహేష్ తో ఇబ్బంది పడిన దర్శక నిర్మాతలు ఎవరు లేరు. అందుకే మహేష్ అంటే అందరు కంఫర్ట్ గా ఫీల్ అవుతారు. ఒక్కసారి సబ్జెక్ట్ ఓకే చేశాక ఇక స్క్రిప్టు విషయంలో జోక్యం చేసుకోడు. ప్రతి సినిమాకు తనలో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటాడీ ఘట్టమనేని హీరో.

ఈసారి వెరైటీగా మీసకట్టుతో కనిపించాలని డిసైడ్ అవడమే కాదు.. చూడండి ఎలా ఉందో నా కొత్త లుక్ అంటూ కొన్ని పిక్స్ కూడా అభిమానుల ముందుంచాడు మహేష్ బాబు. ఈ సూపర్ స్టార్ నయా ఫేస్ కట్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఫుల్లుగా పెంచిన మీసాలు, లైట్ గా కనిపించే గడ్డంతో కాస్త సీరియస్ లుక్ కనిపిస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక, ఈ లుక్ కోసం మహేష్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రత్యేకంగా ముంబయి వెళ్లి మరీ హెయిర్ స్టయిలింగ్ చేయించుకుంటున్నాడు. దేశంలోనే నెంబర్ వన్ హెయిర్ స్టయిలిస్ట్ గా పేరుగాంచిన హకీమ్ అలీమ్ అనే సెలబ్రిటీ హెయిర్ స్టయిలిస్ట్ తో తన మీసకట్టు డిజైన్ చేయించుకున్నాడు.

హకీమ్ అలీమ్ తో ఒక్క సెషన్ కు లక్షల్లోనే ఫీజు ఉంటుందని బాలీవుడ్ టాక్. సరికొత్త టెక్నాలజీకి తన హస్త నైపుణ్యం జోడించి హకీమ్ ఆలీమ్ చేసే హెయిర్ స్టయిలింగ్ అంటే సినీ స్టార్లు ఎంతో లైక్ చేస్తారు.ఈ మధ్య మహేష్ బాబు తరచూ ముంబయి వెళుతుండడంతో ఈ స్టార్ హీరో బాలీవుడ్ ఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్నాడంటూ మీడియా చానళ్లు పొరబడ్డాయి.

వాస్తవానికి మహేష్ బాబు బాలీవుడ్ సినిమాలో నటించాలని కోరుకుంటే నిర్మాతలే హైదరాబాద్ కు క్యూ కడతారు. అతని చరిష్మా అలాంటిది. కానీ వంశీ పైడిపల్లితో తన కొత్త సినిమాలో కొత్త లుక్ కోసమే సీక్రెట్ గా ముంబయి వెళ్లి హకీమ్ అలీమ్ తో హెయిర్ స్టయిల్ సెషన్స్ లో పాల్గొన్నాడట.

లుక్ ను కంప్యూటర్ లో ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్ వేర్ సాయంతో టెస్ట్ చేయించుకుని ఓకే అనుకున్న తర్వాతే మీసాలు పెంచడం కంటిన్యూ చేస్తున్నాడట మహేష్ బాబు. దర్శకుడు వంశీ పైడిపల్లి డైరక్షన్ లో చేయబోయే చిత్రంలో వ్యవసాయం, రైతులు ప్రధాన ఇతివృత్తంగా కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా తెరకెక్కించనున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది.