బుల్లితెర యాంకర్ సుమ దగ్గర పాఠాలు నేర్చుకుంటున్న నాని
తెలుగులో బిగ్ బాస్ 2 సీజన్ అందరూ అనుకున్న విధముగానే చాలా గ్రాండ్ గా ప్రారంభించారు. నాని హోస్టింగ్ గురించి అందరు ఉహించినట్టుగా పెద్దగా హైప్ లేకపోయినా తనదైన స్టైల్ లో చేసి నెట్టుకువస్తున్నాడు. పార్టిసిపెంట్స్ కూడా పెద్దగా ఫెమస్ కానప్పటికీ ప్రేక్షకులు ఎడ్జెస్ట్ అయ్యిపోయారు. అయితే యాంకరింగ్ చేయటం అంటే అంత ఆషామాషీ విషయం కాదు. ఎంతో మంది యాంకర్స్ వచ్చారు…పోయారు. కానీ బుల్లితెరపై యాంకర్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు టక్కున గుర్తుకువచ్చే పేరు సుమ. ఒకరకంగా చెప్పాలంటే యాంకరింగ్ లో సుమ క్వీన్ అని చెప్పాలి. ఆమె అంతలా బుల్లితెరపై హవాను చూపుతుంది. మెగా వేడుకలకు సుమ తప్పనిసరిగా ఉండాల్సిందే.
మొదటిసారిగా బిగ్ బాస్ షోలో యాంకరింగ్ చేస్తున్న నానికి సుమ కొన్ని సలహాలను ఇచ్చిందట. రియాల్టీ షోలో ఎలా మాట్లాడాలి….పార్టిసిపెంట్స్ తో ఎలా చనువుగా ఉండాలి…ప్రేక్షకులను మెప్పించాలంటే ఎలా మాట్లాడాలి… ఇటువంటి విషయాల గురించి నానికి సుమ పెద్ద క్లాసే తీసుకుందట.
నాని ఏ పని చేసిన టాప్ లో ఉండాలని కోరుకుంటాడు. అలాగే దానికి తగ్గట్టుగా కూడా ప్రయత్నాలను గట్టిగానే చేస్తాడు. అందుకే యాంకరింగ్ ఎలా చేయాలో టిప్స్ కోసం సుమకు ఫోన్ కొట్టాడు. సుమ ఇచ్చిన సలహాలతో ఈ వారం ఎలా అదరకొడతాడో చూడాలి.