11 నెలల బాబును ఇంటిలో వదిలి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన శ్యామల…. కారణం తెలిస్తే షాక్
టివి చూసే ప్రేక్షకులకు యాంకర్ శ్యామల గురించి ప్రత్యేకముగా చెప్పనవసరం లేదు. యాంకర్స్ గురించి మాట్లాడినప్పుడు సుమ తర్వాత శ్యామల గురించే చెప్పుకుంటారు. చక్కని డ్రెస్సింగ్ సెన్స్ తో సమయస్ఫూర్తితో కార్యక్రమాన్ని బాగా రక్తి కట్టిస్తుంది. శ్యామల యాంకరింగ్ లో అసలు డబల్ మీనింగ్ డైలాగ్స్ అనేవి ఉండవు. ఒకవైపు యాంకరింగ్ చేస్తూ మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తుంది. ఆమె మొదటి టివి సీరియల్స్ లో నటించింది. అదే ఆమె ఉన్నతికి కారణం అయింది. ఒక విధంగా చెప్పాలంటే ఆమె పెళ్ళికి బాటలు వేసింది టెలివిజన్ రంగమే. ఒక సీరియల్ లో నటిస్తున్నప్పుడు కో యాక్టర్ నరసింహతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత సినిమా స్టైల్ లో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 2 కి సెలక్ట్ కావటంతో తెలుగు రాష్ట్రాల్లో శ్యామల గురించి విపరీతంగా చర్చించుకుంటున్నారు. శ్యామల స్వస్థలం కాకినాడ. చిన్నప్పుడే తండ్రి పోవటంతో తల్లి అన్ని తానై పెంచింది. శ్యామలది బ్రాహ్మణ కుటుంబం కావటంతో ఎన్నో ఆంక్షలు ఉండేవి.
తండ్రి లేకపోవటంతో ఏ నిర్ణయం తీసుకోవాలన్న తల్లి తరుపు బంధువులు అందరూ కూర్చొని నిర్ణయం తీసుకొనేవారు. శ్యామల చిన్నతనం నుండి క్లాజికల్ డాన్స్ లో శిక్షణ తీసుకుంది. నాలుగు సంవత్సరాల వయస్సులో డాన్స్ ప్రదర్శన ఇచ్చి అందరి ప్రశంసలు అందుకుంది.
ఇంటర్ మొదటి సంవత్సరం అయ్యాక హైదరాబాద్ వచ్చేసింది. ప్రయివేట్ గా డిగ్రీ చదివింది. టీచర్ కావాలని అనుకున్న శ్యామల యాక్టర్ అయింది. మొదట R టివిలో ప్రముఖుల ఇంటర్వ్యూలు తీసుకొనేది. కొంతకాలం లయ టివిలో పనిచేసి సీరియల్స్ లో అడుగు పెట్టింది.
ఆ సమయంలో నరసింహతో ప్రేమలో పడటం, కులాలు వేరు కావటంతో శ్యామల తల్లి అంగీకరించలేదు. దాంతో శ్యామల తల్లి ,బావ వచ్చి శ్యామల షూటింగ్ లో ఉంటే అక్కడ గొడవ చేసారు. ఈ విషయాన్నీ అక్కడే ఉన్న హరితేజ మరో సీరియల్ లో బిజీగా ఉన్న నరసింహకి ఫోన్ చేస్తే నరసింహ ప్రొడక్షన్ మేనేజర్ ని పంపితే అప్పుడు అక్కడ పెద్ద గొడవ అవటం పెద్ద సంచలనం అయింది.
అప్పటికి శ్యామల వయస్సు 17 సంవత్సరాలే కావటంతో తన అక్క ఇంటిలో వదిలిపెట్టాడు నరసింహ. శ్యామల మేజర్ కాగానే వివాహం చేసుకున్నాడు. వీరికి ఇషాన్ అనే బాబు ఉన్నాడు. బాబు వయస్సు 11 నెలలు. పాలు త్రాగే చంటిబిడ్డను వదిలి శ్యామల బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళటం చాలా మందికి షాక్ కలిగించింది.
బిగ్ బాస్ అఫర్ రాగానే చాలా ఆనందం వేసిందని, అయితే నెలల పిల్లవాడిని ఎలా వదిలి వెళ్ళటానికి దిగులు వేసిందని, తన భర్త ప్రోత్సాహంతో బిగ్ బాస్ హౌస్ కి వచ్చింది శ్యామల. శ్యామలకు భర్త నరసింహ అంటే ఎంతో నమ్మకం. కొడుకు ఇషాన్ ని కంటికి రెప్పలా చూస్తాడని అంటుంది శ్యామల.