పవన్ పేరుని జోడించి నా కొడుకును పిలవద్దు… అభిమానులకు రేణు వార్నింగ్
సినీ పరిశ్రమలో వారసులు రావటం ఎప్పటి నుంచో ఉంది. హీరోలు తమ పిల్లలను వారసులుగా చూడాలని అనుకోవటం తప్పు లేదు. అయితే అందరి హీరోల పిల్లలు సక్సెస్ అవుతారనే గ్యారెంటీ మాత్రం లేదు. తండ్రి వారసత్వాన్ని పుచ్చుకొని సినీ పరిశ్రమకు వచ్చిన తామేమిటో నిరూపించుకోకపోతే ఇక అంతే సంగతులు. సినీ పరిశ్రమలో తండ్రి బిరుదులను వారి పిల్లలకు ఆపాదించటం కూడా ఆనవాయితీగా వస్తుంది. సూపర్ స్టార్స్,మెగా హీరోలు, రెబల్ స్టార్స్ ఇలా చూసుకుంటే లిస్ట్ చాలా పెద్దగానే కన్పిస్తుంది. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కూడా ఒక వారసుడు సిద్ధంగా ఉన్నాడు. పవన్,రేణు దేశాయ్ కొడుకు అకిరా తండ్రి అంతటి వాడు అయ్యాడు. త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ చేసే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లో బిజీగా మారటంతో పవన్ అభిమానులు అకిరా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అందుకే పవన్ అభిమానులు ఇప్పటి నుంచే జూనియర్ పవర్ స్టార్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
అయితే రేణు దేశాయ్ మాత్రం అకిరాని జూనియర్ పవర్ స్టార్ అంటే ఇష్టపడటం లేదు. మరోసారి అకిరాను జూనియర్ పవర్ స్టార్ అని అంటే వారి కామెంట్స్ డిలీట్ చేసేస్తానని, ఇంకా మనకపోతే వారి అకౌంట్స్ ని బ్లాక్ చేసేస్తానని హెచ్చరించింది.
జూనియర్ పవర్ స్టార్ అనేది అకిరాకు కూడా నచ్చటం లేదని ,ఇక మీదట ఎవరు ఆలా సంబోదించవద్దని కోరింది. అంతేకాక అకిరా ఫోటోలను కొన్ని పోస్ట్ చేసి… అకీరాను చూస్తూ ఉంటే యూరోపియన్ సినిమాలోని ఒక సీరియస్ క్యారెక్టర్ ని చూస్తున్నట్టు ఉందని చెప్తూ రేణు దేశాయ్ మురిసిపోయింది.