తనకు ఉన్న వ్యాధిపై క్లారిటీ ఇచ్చిన రానా
దగ్గుపాటి మూడో తరం వారసుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు దగ్గుపాటి రానా. రానా బాబాయ్ వెంకటేష్ ప్రముఖ హీరో కాగా,రానా తండ్రి సురేష్ బాబు నిర్మాత. రానా మాత్రం బాబాయ్ బాటలో నడిచి నటుడిగా తన సత్తా ఏమిటో చాటాడు. లీడర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించాడు. రానా ఇప్పటి హీరోలకు బిన్నం అని చెప్పాలి. ఎందుకంటే రానా తెలుగుకి పరిమితం కాకుండా హిందీ,తమిళ,కన్నడ భాషల్లో నటిస్తూన్నాడు. రానా ఏ జోనర్ సినిమా అయినా చేయటానికి సిద్ధంగా ఉంటాడు.
అయితే గత కొన్ని రోజులుగా రానా ఆరోగ్యంపై అనేక రకాల రూమర్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. రానాకి చిన్నప్పటి నుండి కంటి చూపు సరిగా లేని సంగతి అందరికి తెలిసిందే. రెండు కళ్ళలో ఒక కంటికి దాత సాయంతో అమర్చుకున్నాడు. ఇప్పుడు మరొక కన్ను కూడా ఇబ్బంది పెట్టటంతో సర్జరీ కోసం విదేశాలకు తరలి వెళ్ళాడు.
దాంతో రానా ఆరోగ్యం క్షిణించిందని సింగపూర్ లో రజని వైద్యం చేయించుకొనే ఆసుపత్రిలో చేరాడని అనేక రకాల వార్తలు హల్ చల్ చేసాయి. అంతేకాక రానా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడని కూడా వార్తలు వచ్చాయి. ఒక ఈవెంట్ కి హాజరు అయినా రానా తన ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పి రూమర్స్ కి తెరదించాడు.
తనకు కిడ్నీ సమస్య లేదని, కంటికి సర్జరీ చేయించుకుంటున్నానని, కాస్త బీపీ ఉండటం వలన కంట్రోల్ కి వచ్చాక సర్జరీ చేయించుకుంటానని చెప్పాడు. సర్జరీ అయ్యాక కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోని మరల సినిమాల్లో నటిస్తానని,అభిమానులు ఎవరు ఆందోళన చెందవద్దని పుకార్లను నమ్మవద్దని చెప్పాడు రానా.