Movies

రెండో భర్త గురించి నిజాలు బయటపెట్టిన రేణు దేశాయ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ మరోసారి పెళ్లి కూతురు కాబోతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పవన్ నుంచి విడిపోయాక రేణూ పిల్లలు అకీరా, ఆద్యలతో కలిసి పుణే వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. తన కొడుకు, కూతురు ఆలనాపాలనా చూసుకోవడమే కాకుండా, మరాఠీ చిత్ర రంగంలో ప్రవేశించి తన అభిరుచికి తగిన చిత్రాలు తెరకెక్కిస్తూ దర్శకురాలిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది రేణూ దేశాయ్. పవన్ కల్యాణ్ అప్పుడప్పుడు పుణే వెళ్లడం, రేణూ కూడా పిల్లల్ని తీసుకుని హైదరాబాద్ రావడం ఇప్పటివరకు జరిగింది. అయితే ఇకమీదట కూడా అలాగే జరుగుతుందన్న భావన క్రమంగా తొలగిపోతోంది.ఎందుకంటే గత కొన్నాళ్లుగా తోడు కోసం పరితపిస్తున్న రేణూ దేశాయ్ తన జీవిత భాగస్వామిని వెదుక్కున్నట్టు ఆమె పెడుతున్న పోస్టుల ద్వారా అర్థమవుతోంది.

ఇటీవలే ఓ వ్యక్తి చేతిలో చెయ్యేసి ఉన్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో పీకే ఫ్యాన్స్ లో కదలిక వచ్చింది. చాలామంది ఆమెకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ వ్యక్తి ఎవరో తెలియక సస్పెన్స్ తో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పుడు మరోసారి తన కాబోయే భర్త గురించి అభిమానులతో పంచుకుంది రేణూ దేశాయ్.

కొన్నిరోజుల కిందట రేణూ దేశాయ్ తన పిల్లలు, స్నేహితులతో కలిసి గోవాలో విహారానికి వెళ్లింది. అయితే… తన కాబోయే భర్త నుంచి వచ్చే మెసేజ్ లను ఫ్రెండ్స్ చూడనివ్వడంలేదని చిరుకోపం ప్రదర్శించింది.తనకు గోవా వచ్చినా ప్రైవసీ లేకుండా పోయిందని, తన ఉడ్ బీ అదేపనిగా మెసేజ్ లు పంపిస్తున్నా రిప్లయ్ ఇవ్వలేకపోతున్నానని, ఎంతసేపటికీ ఫ్రెండ్స్ పక్కనే ఉండడంతో అతనితో టెక్ట్సింగ్ చేయలేకపోతున్నానని వాపోయింది ఈ మరాఠీ ముద్దుగుమ్మ.

బీచ్ వేర్ లో కనిపిస్తున్న రేణూ దేశాయ్ ఫోన్ పట్టుకుని సంతోషంగా మెసేజ్ లు చూస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు విపరీతంగా స్ప్రెడ్ అవుతోంది. ఈ పిక్ ను రేణూనే స్వయంగా పోస్టు చేసింది. రేణూ జోష్ చూస్తుంటే త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతోందన్న విషయం అర్థమవుతోందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇప్పుడందరిలో ఆసక్తి కలిగిస్తున్న అంశం ఏమిటంటే… పెళ్లి తర్వాత పిల్లల విషయంలో రేణూ ఏ నిర్ణయం తీసుకుంటుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.