Movies

దీప్తి సునైనాకు బిగ్ బాస్ వార్నింగ్…నీ వల్ల ఒకడు అవుట్

బిగ్ బాస్ సీజన్ 2రెండో వారం వెకెండ్ కి వచ్చింది. మొదటి వారం వెకెండ్ లో శనివారం వచ్చిన నానికి హౌస్ లో జరిగిన విషయాలను అందరు చెప్పారు. హౌస్ లో అందరికన్నా చిన్నది అయినా దీప్తి సునైనాకు సపోర్ట్ నిలిచాడు నాని. అయితే ఈ వారం పరిస్థితి మారింది. స్టార్ మా విడుదల చేసిన ప్రోమోలో నాని దీప్తి సునైనాను తిట్టి పోసాడు. దీప్తి చేసిన పనికి మెరుగైన పార్టిసిపెంట్ బయటకు వెళ్ళిపోతున్నాడని అన్నాడు. అయితే ఆ పార్టిసిపెంట్ ఎవరా అనేది ఆ ప్రోమోలో చూపించలేదు. శుక్రవారం వరకు పేక్షకుల నుండి దాదాపుగా 3 కోట్ల వరకు ఓట్లు వచ్చాయి. ఈ ఓట్లలో మొదటి వారం వలే ఈ వారం కూడా దీప్తి సునైనా అత్యధికంగా ఓట్లను సంపాదించింది.

హౌస్ లో చిట్టి పొట్టి మాటలతో,చేష్టలతో అందరిని ఆకట్టుకుంది. హౌస్ లో అందరితో మాట్లాడుతూ అందరిలో చిన్నదానిగా సుకుమారంగా ఉంటుంది. దాంతో అందరూ దీప్తి సునైనా ఆంటే చాలా ఇష్టపడుతున్నారు. ఈ వారం కూడా అత్యధిక ఓట్లతో ఎలిమినేషన్ నుండి సేఫ్ అయ్యిపోయింది. ఎలిమినేషన్ లో ఉన్న నూతన్,గణేష్ లు కౌశల్ చేసిన అతి వల్ల సేఫ్ అయినట్టు సమాచారం.

నాని చెప్పిన విధానాన్ని బట్టి ఈ వారం ఎలిమినేషన్ అయ్యేది కౌశల్ అని అర్ధం అయ్యిపోయింది. గత వారం స్కిట్ లో భాగంగా దీప్తి సునైనా కుందేలు వేషము వేసుకొని అందర్నీ భయపెట్టే సమయంలో కౌశల్ ఎత్తి పట్టుకొని కింద పాడేసాడు.

అప్పుడు ఏమి మాట్లాడకపోయినా, ఆ తర్వాత కౌశల్ చేసిన పనికి ఇంటి సభ్యుల దగ్గర చెప్పి బాధపడింది. ఇక శుక్రవారం ఇంటి సభ్యులపై కౌశల్ వ్యవహారం చూసి అందరూ అతనికి వ్యతిరేకంగా ఓట్లు వేసినట్టు సమాచారం.