బిగ్ బాస్ సీజన్ 2 కి నూతన్ నాయుడు గుడ్ బై
బిగ్ బాస్ సీజన్ 2 మొదలు పెట్టి ఈ రోజుతో రెండు వారాలు పూర్తి అవుతుంది. మొదటి వారం హోస్ లో రచ్చ చేసిన సంజన ఎలిమినేటి అయ్యిపోయింది. ఇప్పుడు రెండో వారం ఎవరు ఎలిమినేటి అవుతారో కొంచెం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు రెండో వారం ఎలిమినేషన్ లో దీప్తి సునైనా,బాబు గోగినేని,గణేష్,నూతన్ నాయుడు,కౌశల్ ఉన్నారు. శుక్రవారం వరకు పేక్షకుల నుండి దాదాపుగా 3 కోట్ల వరకు ఓట్లు వచ్చాయి. ఈ ఓట్లలో మొదటి వారం వలే ఈ వారం కూడా దీప్తి సునైనా అత్యధికంగా ఓట్లను సంపాదించింది.హౌస్ లో చిట్టి పొట్టి మాటలతో,చేష్టలతో అందరిని ఆకట్టుకుంది. హౌస్ లో అందరితో మాట్లాడుతూ అందరిలో చిన్నదానిగా సుకుమారంగా ఉంటుంది. దాంతో అందరూ దీప్తి సునైనా ఆంటే చాలా ఇష్టపడుతున్నారు. ఈ వారం కూడా అత్యధిక ఓట్లతో ఎలిమినేషన్ నుండి సేఫ్ అయ్యిపోయింది.
బాబు గోగినేని కూడా ఎలిమినేషన్ నుండి సేఫ్ అయినట్టు సమాచారం. హౌస్ లో బాబు గోగినేని అందర్నీ సమన్వయ పరుస్తూ,ఎవరైనా తప్పు చేస్తే హెచ్చరిస్తూ ముందుకు సాగుతున్నారు. దాంతో బాబు గోగినేని మీద ఇంటి సభ్యుల్లోనూ,ప్రేక్షకుల్లోనూ వ్యతిరేకత లేదు.
ఎంతో కొంత సినీ నేపధ్యం ఉన్న కౌశల్ కూడా ఎలిమినేట్ నుండి తప్పించుకున్నాడట. రెండో వారం శుక్రవారం రోజున కౌశల్ రెచ్చిపోయాడు. కౌశల్ తేజస్వి,తనీష్,సామ్రాట్ చేస్తున్న రాజకీయాల గురించి ప్రశ్నించాడు. అలాగే అమ్మాయిల మీద చేతులు వేస్తాడని డిఫెన్స్ లో పాడేసిన తీరును కూడా అందరి ముందు ఎండగట్టాడు.
కౌశల్ లో ఉన్న నిజాయితీని ప్రేక్షకులు కూడా ఇష్టపడుతున్నారు. అందుకే ఈ రోజు ఎలిమినేషన్ నుండి కౌశల్ బయట పడతాడని అంటున్నారు. ఇక మిగిలింది గణేష్,నూతన్ నాయుడు. వీరిద్దరూ చాలా తక్కువ ఓట్లను దక్కించుకున్నారు. వీరిద్దరిలో నాని గణేష్ సేఫ్ అన్నట్టుగా మాట్లాడాడు. ఇక మిగిలింది నూతన్ నాయుడు. కాబట్టి ఈ రోజు నూతన్ నాయుడు ఎలిమినేటి అయితే కావచ్చు.