Movies

యాంకరింగ్ లో రెచ్చిపోయిన నాని….కారణం ఎన్టీఆర్…?

బిగ్ బాస్ రెండో సీజన్ మొదటి వారం చూసాక అందరూ నాని హోస్టింగ్ కి పెదవి విరిచారు. నాని తేలిపోయాడని ఎన్టీఆర్ తో పోలుస్తూ సెటైర్స్ వేశారు. మొదటి వారం ఎలిమినేషన్ కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. దీనితో అందరూ నిరుత్సాహపడ్డారు. అయితే నిన్న శనివారం నాని విశ్వరూపమే ప్రదర్శించాడు. వారం రోజులుగా ఇంటిలో జరిగిన రచ్చ,ఎవరైతే ఇంటిలో అతిగా ప్రవర్తించారో వారందరికీ వార్నింగ్ ఇచ్చాడు. శనివారం వార్నింగ్ ఇచ్చిన నాని ఆదివారం అందరిని నవ్వించాడు….కవ్వించి మరీ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చాడు. ఆదివారం ప్రసారమయ్యే ఎపిసోడ్ ప్రోమోలో నానిని చూసి అవాక్కయ్యారు. ఈ ప్రోమోలో నాని ఇంటి సభ్యులతో అనేక రకాల ఆటలను ఆడిస్తూ అందరిని ఉత్సాహపరచాడు.

శనివారం బిగ్ బాస్ ప్రారంభం అయినప్పుడు నాని బిగ్ బాస్ హిట్ కావటానికి మా టీమ్ చాలా కష్టపడుతుందని చెప్పాడు. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నానని చెప్పుతూ శనివారం వీర లెవల్లో యాంకరింగ్ చేసి దుమ్ము దులిపేసాడు.

బిగ్ బాస్ మొదటి సీజన్ పూర్తి అయ్యేసరికి నాని వ్యాఖ్యానంపై పెదవి విరవటం,బిగ్ బాస్ యాజమాన్యం నుండి ఒత్తిడి రావటంతో నాని తనని తాను మార్చుకోవాలని డిసైడ్ అయ్యి పాత హోస్ట్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళాడట.

ఎన్టీఆర్ తో బిగ్ బాస్ హోస్టింగ్ ఎలా చేస్తే బాగుంటుందో డిస్కస్ చేసి మరీ శనివారం యాంకరింగ్ చేసి శబాష్ అనిపించుకున్నాడు. ఇక ఆదివారం విడుదల చేసిన ప్రోమోలో నాని కామెడీ టైమింగ్ అన్ని ఆఅదిరిపోయే రేంజ్ లో ఉన్నాయి.