అకిరా లేని సమయంలో రేణు ఎంత పని చేసిందో తెలుసా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయాక రేణు దేశాయ్ చాలా కాలం పాటు ఒంటరితనాన్ని అనుభవించి ఎట్టకేలకు ఒక తోడును వెతుక్కుంది. గత కొన్ని రోజులుగా రేణు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకుంటున్న పిక్స్ చూస్తే పెళ్లి కోసం రేణు ఎంత తొందర పడుతుందో అర్ధం అవుతుంది. ఇంత కాలానికి తనను అర్ధం చేసుకొనే జీవితభాగస్వామి దొరికాడని, ఇప్పుడు తన జీవితానికి ఒక అర్ధం ఏర్పడిందని రేణు ఆ పిక్స్ కి క్యాప్షన్ పెట్టింది. రేణు కొన్ని రోజుల క్రితం ఫ్రెండ్స్ తో కలిసి గోవా వెళ్లి మస్త్ గా ఎంజాయ్ చేసింది. ఆ సమయంలో కొడుకు అకిరా పవన్ కళ్యాణ్ తో పాటు హైదరాబాద్ లో ఉన్నాడు. ఆ తర్వాత అకిరా తండ్రితో కలిసి విజయవాడ వచ్చాడు.
ఒకవైపు అకిరా హైదరాబాద్ లో ఉండగా రేణు తన రెండో పెళ్ళికి సంబందించిన ముఖ్యమైన ఘట్టాన్ని పూర్తి చేసుకోవటం చాలా మందిని షాక్ కి గురి చేసింది. లేటెస్ట్ గా ఆమె పోస్ట్ చేసిన పిక్ లో ఓ చేతివేలుకు తొడిగిన ఎంగేజ్ మెంట్ రింగ్ కనపడుతుంది. దాంతో రేణు పెళ్లి మరి కొద్దిరోజుల్లోనే అని అర్ధం అవుతుంది. అయితే ఈ విషయంపై నెటిజన్స్ భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
జీవితంలో ఎంతో ముఖ్యమైన ఈవెంట్ ని అకిరా లేకుండా ఎలా జరుపుకుందని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం రేణుతో ప్రేమలో ఉన్న వ్యక్తికీ తన పిల్లల గురించి కూడా తెలిసే ఉంటుంది. అలాంటప్పుడు అకిరాను హైదరాబాద్ పంపించటం వెనక రేణు ఆంతర్యం ఏమిటో అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.
తన ఎంగేజ్ మెంట్ ముందే ప్లాన్ చేసుకున్న రేణు పెద్దవాడైన అకీరా ఉంటే తనకు ఇబ్బందిగా ఉంటుందని భావించి పవన్ దగ్గరకు పంపించిందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పుస్తకాల ద్వారా ఎంతో లోకజ్ఞానాన్ని సంపాదించిన అకిరా కూడా తల్లి పరిస్థితిని అర్ధం చేసుకొని ఎంగేజ్ మెంట్ కి దూరంగా ఉన్నట్టు భావిస్తున్నారు.చిన్నదైనా అధ్యకు ఈ విషయాలు అర్ధం కావని రేణు అధ్యను గోవాకు తీసుకువెళ్ళింది. అక్కడే ఎంగేజ్ మెంట్ జరిగినట్టుగా సమాచారం.