Movies

పెళ్లి గురించి దిమ్మతిరిగే జవాబిచ్చిన రేష్మి

రేష్మి అని చెప్పగానే తెలుగు రాష్ట్రాల్లో తెలియని కుర్రకారు ఉండదు. జబర్ దస్త్ తో సక్సెస్ ట్రాక్ ఎక్కిన ఈ వైజాగ్ బ్యూటీ బుల్లితెరపై తన అందచందాలతో ఫిదా చేసింది. రేష్మి గౌతమ్ ఇప్పుడు సినీమాల్లో కూడా జిగేల్ మనిపిస్తోంది. తెలుగు ఎంటర్ టైన్ మెంట్ చానల్స్ వీరలెవల్లో ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ అందాల భామ,భారీ రెమ్యునరేషన్ తీసుకునే యాంకర్లలో ఒకరిగా నిల్చింది. ఇక రేష్మి ఫాలోయింగ్ చూస్తే, టాలీవుడ్ హీరోయిన్స్ కి కూడా అసూయ పుట్టకమానదు. ఈ సుందరాంగిపై ఊహాగానాలు కూడా బానే వినిపిస్తుంటాయి. ముఖ్యంగా ఆమెకు అభిమానులు కొంటె ప్రశ్నలు వేసి మరీ ఆమె మనసులో ఉన్నది రాబడుతుంటారు.

అదేరీతిలో ఆమెపై తాజాగా కొందరు ప్రశ్నలు సాధిస్తే,ఆమె కూడా ఘాటుగానే స్పందించింది. జబర్ దస్త్ లో సుడిగాలి సుధీర్ తో ఈ బ్యూటీ ప్రేమలో పడిందన్న వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ ఇద్దరి యవ్వారంపై లెక్కనేనన్ని కథనాలు గుప్పుమన్నాయి. ఎందుకంటే డీ టెన్ లో వీరిద్దరిని చూసిన వాళ్ళు మొదట వీళ్ళు ప్రేమికులనే భావించారు.

లేకుంటే ఇంతలా కెమిస్ట్రీ వర్కవుట్ కాదని తేల్చేసారు కూడా. మరి రేష్మి తక్కువమే తినలేదు కదా,అందుకే తనపై వచ్చే పుకార్లపై ఘాటుగానే స్పందిస్తూ ఉంటుంది. ఇప్పుడు మరోసారి కూడా అదే తరహాలో బదులిచ్చింది. సుధీర్ ఓసారి ప్రపోజ్ చేసినపుడు జవాబివ్వకపోవడం నా ఇష్టమని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది.

సుధీర్ ని అసలు ప్రేమించడం లేదని,’అయినా నన్ను ఇష్టపడుతున్న విషయం మీకేమైనా చెప్పాడా” అంటూ అభిమానులను కడిగి పారేసింది. ఇక ‘మీ పెళ్ళెప్పుడు అంటూ ఓ అభిమాని ప్రశ్నిస్తే, ‘ఏం నా పెళ్లి మీరు చేస్తారా’అని దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చింది.

‘నేను ఎవరిని ప్రేమించాను,ఎవరిని పెళ్లిచేసుకుంటాను అన్నది’ తన వ్యక్తిగతమని రేష్మి మరో అభిమాని ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. ఇక మరో అభిమాని అయితే ‘నాకు 5ఎకరాల పొలం, స్కూటర్ ఇంకా చాలా వున్నాయి. నన్ను పెళ్లి చేసుకుంటారా’అని అడిగేసరికి,’ నేను చేసుకోను’ అని ధీటుగా బదులిచ్చింది.