ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత వరకు చదివారో తెలుసా?
ప్రస్తుతం దేశంలోని రాజకీయవేత్తలో నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం గల ఎపి సీఎం చంద్రబాబు అంటే దేశంలోనే కాదు,ప్రపంచంలోనే అందరికీ తెలుసున్న వ్యక్తి. తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సంతరించుకున్న చంద్రబాబుని రాజకీయ వర్గాల్లో అపర చాణక్యుడుగా గుర్తింపు పొందారు. క్లిష్ట సమయంలో రాజకీయ ఎత్తుగడలు వేయడంలో బాబుని మించిన మొనగాడు లేడని ప్రత్యర్ధులు సైతం కొన్నిసార్లు ఒప్పుకున్న సందర్భాలున్నాయి. ఇక సమస్యలను పరిష్కరించగల ఓర్పు నేర్పు ఆయన సొంతం. అందుకే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీకి చంద్రబాబు సరైన నేతగా ప్రజలు గుర్తించి పట్టం కట్టారు. ప్రజా సంక్షేమమే తనకు ముఖ్యమని పదేపదే చెప్పే సీఎం చంద్రబాబు అందుకనుగుణంగా ప్రణాళికలు రచించి అమలు చేస్తారు
ఇక ఓ రాష్ట్రానికి ప్రపంచ పటంలో గుర్తింపు తేవడం ఆషామాషీ వ్యవహారం కాదు. అనేక దేశాల పారిశ్రామిక వేత్తలకు ఏపీని అనువైన రాష్ట్రంగా మార్చారు. ప్రపంచంలో పేరొందిన అనేక కంపెనీలు పరిశ్రమల స్థాపనకు ఏపీలో బారులు తీరుతున్నారంటే అర్ధం చేసుకోవచ్చు. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చారు. అందునా ఐటి రంగాన్ని భాగ్యనగరంలో వెళ్ళోనుకునేలా చేసింది చంద్రబాబే. ముఖ్యమంత్రి అయినప్పటికీ ఓ ఆర్ధిక శాస్త్రవేత్తల ఆలోచించడం ఆయన శైలి.
అందుకే ఆర్ధిక రంగానికి చెందిన ఎన్నో సంస్థల నుంచి ఆయనకు అవార్డులు వరించాయి. ది ఎకనామిక్స్ టైమ్స్ నుంచి బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్,టైమ్స్ ఏషియా నుంచి సౌత్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ వంటి ఎన్నో ప్రత్యేక అవార్డులు ఆయన్ని వెతుకుంటూ వచ్చాయి.ప్రపంచ దేశాలకు సాధ్యం కానీ ఎన్నో ఘనతలు సొంతం కావడం వెనుక ఆయన చదువుకున్న చదువే కారణమని పలువురు విశ్లేషిస్తారు.
చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లె అనే కుగ్రామంలో జన్మించిన చంద్రబాబు తండ్రి ఖర్జుర నాయుడు సాధారణ రైతు. తల్లి అమ్మణమ్మ ఇంటి పనులు చూసుకునేది. చిన్నప్పుడు ఆ ఊళ్ళో స్కూల్ లేకపోవడంతో చంద్రబాబు పక్కనే గల శేషాపురం గ్రామానికి కాలినడకన వెళ్లి చదువు సాగించారు. చంద్రగిరి హైస్కూల్ లో 9వ తరగతి వరకు చదివిన చంద్రబాబు తిరుపతిలో టెన్త్ పూర్తిచేశారు.
ఇంటర్ కూడా అక్కడే పూర్తిచేసిన ఆయన 1977లో బిఎ పట్టా అందుకున్నారు. చిన్ననాటినుంచి ఆర్ధిక సంబంధ విషయాలపై ఎంతో మక్కువ గల చంద్రబాబు తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో ఎం ఏ ఎకనామిక్స్ చేసారు. అంతేకాదు అక్కడే ఎకనామిక్స్ లో ఎం ఫీల్ కూడా పూర్తిచేశారు.
ఈవిధంగా తనకు ఇష్టమైన విద్యా తృష్ణను తీర్చుకున్న చంద్రబాబుకి ఇంటర్ నుంచే లీడర్ షిప్ క్వాలిటీకి కూడా పుష్కలంగా ఉండేవి. అందుకే స్టూడెంట్ పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉంటూనే మరోవైపు చదువులో కూడా రాణించారు.
చివరకు ఆయన్ని రాజకీయ రంగమే తివాచి పరిచి పెద్దపీట వేసింది. విద్యార్థి నేతగా చురుకైన పాత్ర పోషించిన చంద్రబాబు రాజకీయ రంగంలో కాలుపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1978ఎన్నికల్లో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యే గా ఎన్నికైన ఆయన టి అంజయ్య సీఎం గా ఉండగా, ఆయన మంత్రి వర్గంలో మంత్రి అయ్యారు. రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల బోర్డు డైరెక్టర్ గా కూడా వ్యవహరించారు. 1980నుంచి 83వరకూ సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేసిన బాబుకి అసమయంలోనే ఎన్టీఆర్ తో పరిచయం ఏర్పడింది.
1981లో ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరి ని వివాహమాడారు. అయితే 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ నెలకొల్పినప్పటికే చంద్రబాబు అందులో చేరలేదు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కల్సి కాంగ్రెస్ లోనే కొనసాగిన బాబు 1983లో కాంగ్రెస్ పక్షాన పోటీచేసి ఓటమి చెందారు ఆతర్వాత 1984లో టిడిపి లో చేరిన బాబు అంచెలంచెలుగా ఎదిగి, ఆఖరికి కొన్ని పరిస్థితుల కారణంగా ఎన్టీఆర్ తో విభేదించి టీడీపీ సారథ్యంతో పాటు ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తదుపరి ప్రస్థానం అందరికీ తెల్సిందే.
అయితే సీఎం గా ఉన్నప్పటికీ ఓ ఆర్ధిక వేత్తలా, పక్కా టెక్నీకల్ ఇంజనీర్ గా ఆలోచించడం ఆయనకే చెల్లింది. అప్పట్లో అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ ఏపీకి వచ్చినపుడు చంద్రబాబు విజన్ ని ప్రశంసలతో ముంచెత్తారు. ఇలా ప్రపంచ దేశాల అధినేతలు సైతం బాబు దూర దృష్టిని అభినందించారు. బాబు పథకాలను,విజన్ మైక్రో సాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కూడా ఇష్టపడేవారన్న సంగతి తెల్సిందే.