Movies

ఇంటి సభ్యులపై బిగ్ బాస్ ఆగ్రహం…ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు.

బిగ్ బాస్ లో సరికొత్త టాస్క్ లతో ఇంటి సభ్యులు ప్రేక్షకులను చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 2 లో శుక్రవారం 20 వ రోజుకి ప్రవేశించింది. ఉదయం లేవగానే అందరూ ఉల్లాసంగా ఉన్నారు. బిగ్ బాస్ రోజు రోజుకి ఆసక్తికరంగా మారుతుంది. ఇప్పటికే ఓ దఫా బిగ్ బాస్ హౌస్ లో సభ్యుల ప్రవర్తనపై ఆగ్రహం చెందిన బిగ్ బాస్ మరోసారి మండిపడ్డారు. హౌస్ రూల్స్ సరిగ్గా పాటించకపోతే ఇలాగని నిలదీశారు. అతిగా మాట్లాడ్డం, నిద్ర పోవడం,మైక్ సరిగ్గా పెట్టుకోకవపోవడం వంటి తప్పులను ఎత్తిచూపుతూ బిగ్ బాస్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇలా రూల్స్ పాటించని ఇద్దరి పేర్లు చెప్పాలని కెప్టెన్ రోల్ రైడర్ ని బాగ్ బాస్ ఆదేశించడంతో బాబు గోగినేని, తనీష్ ల పేర్లు వెల్లడయ్యాయి. ఇంకేముంది వాళ్ళిద్దరినీ జైల్లో పెట్టాలని రోల్ రైడర్ ని బిగ్ బాస్ ఆదేశించారు.

ఇక ఈ విషయంలో కౌశల్ తీరుపై హౌస్ మెంబర్స్ అసహనంతో ఊగిపోయారు. తన దగ్గరున్న జైలు కార్డు వినియోగించకుండా మౌనం దాల్చడం తగదని నిలదీశారు. అయితే కార్డు గురించి బాబు గోగినేని,తనీష్ ని అడిగానని గీతా మాధురి కి కౌశల్ చెబుతాడు.

అయితే ఈ విషయం తెలీని మిగిలిన సభ్యులు మాత్రం కౌశల్ ని తిట్టుకుంటారు. మరి వీరిద్దరూ జైలు నుంచి బయటకు వస్తారో,ఇప్పటికైనా హౌస్ లో అందరూ రూల్స్ సక్రమంగా పాటిస్తారో అసలు ఏమౌతుందో రేపు చూడాలి.