ఓపిక ఉండగానే ఆస్తుల పంపకాలు చేస్తున్న సినీ ప్రముఖులు… ఎందుకో తెలుసా?
దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని, ఓపిక ఉండగానే తమ ఆస్తుల పంపకాలు చేయాలని అంటుంటారు. గతంలో ఇలా వీలునామాలు కూడా రాసేవారు. అయితే రాను రాను , తాము బానే ఉన్నాం కదా. పంపకాలు అప్పుడే ఏమిటి అనే తీరు నడుస్తోంది. అయితే ఉన్నట్టుండి అనుకోని మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో వారి వారసులకు శాపంగా పరిణమిస్తోంది. అందుకే మళ్ళీ పరిస్థితి మారుతోంది. ఎందుకంటే దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు బతికుండగా ఆస్తుల పంపకాల గురించి ఆలోచన చేసినా చుట్టూ వున్నవాళ్లు తొందరేమిటని వారించడంతో చేయకపోవడం వలన ఆయన హఠాత్ మరణం తర్వాత చిక్కులొచ్చాయని అంటుంటారు. అలాగే డాక్టర్ రామానాయుడు మరణంతో విక్టరీ వెంకటేష్ కి పెద్ద కొడుకు సురేష్ కి మధ్య విబేధాలు తలెత్తాయని చెబుతారు.
అలాగే అక్కినేని మరణం తర్వాత ఆస్తుల పంపకంలో పెద్ద కొడుక్కి అన్యాయం జరిగిందన్న మాట వినిపించింది. ఈ నేపధ్యంలో ఓపిక ఉండగానే ఆస్తుల పంపకం ముగించేయాలని ఇప్పుడు కొందరు సినీ ప్రముఖులు యోచన చేస్తున్నారట. సూపర్ స్టార్ కృష్ణ ఆ దిశగా ఆలోచిస్తూ తన మొత్తం ఆస్తిని మూడు భాగాలుగా వేయాలని భావిస్తున్నారట.
ఒక వాటా మొదటి భార్య ఇందిరకు, రెండవ వాటా తనను నమ్ముకున్న సోదరుల పిల్లలకు,మూడవ వాటా విజయ నిర్మలకు చెందేలా చేసినట్లు వినికిడి. ఇక మహేష్ బాబు సలహాపై పెద్ద కొడుకు రమేష్ బాబుకి కొంచెం ఎక్కువ వాటా కట్టబెట్టాడని తెలుస్తోంది. ఎందుకంటే మహేష్ బాబుకి ఆర్ధికంగా బానే వుంది. ఇటు సినిమాలు, అటు బ్రాండ్ అంబాసిడర్ గా పుష్కలంగా సంపాదిస్తున్నాడు. దీనికి తోడు అతని భార్య నమ్రత నుంచి కూడా సంపద వస్తోంది.
ఇక మరోపక్క కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విషయం తీసుకుంటే ఆయన కున్న జూబ్లీ హిల్స్ లోని ఇంటిని కూతురు మంచు లక్ష్మికి ఇవ్వాలని నిర్ణయించారట. ఎందుకంటే లక్ష్మి భర్త స్థితి మంతుడు కాకపోవడమే కారణమట. అందుకే ఇల్లు ఆమె పేరున రాసి, కొత్తగా శంషాబాద్ దగ్గర మోహన్ బాబు ఇల్లు కట్టుకున్నాడు.
మంచు లక్ష్మి కి ముందుగా వాటా ఇచ్చి, మిగిలినది మంచు విష్ణు,మంచు మనోజ్ లకు సమానంగా పంచుతున్నారు. వారసత్వ నటనతో పాటు అటు ఆస్తులన్నింటినీ సమానంగా పంచిపెట్టాడని తెలుస్తోంది. మొత్తానికి ఓపిక ఉండగానే అన్నీ చక్కబెట్టాలని కాన్సెప్ట్ మంచిదే కదా.