Uncategorized

ధోనికి హెలికాప్టర్ షాట్ నేర్పింది ఎవరో తెలుసా?

ధోని మొదట్లో జులపాల జుట్టుతో చాలా వెరైటీగా ఉండేవాడు. ఆ జులపాల జుట్టుతో హెలికాప్టర్ షాట్స్ ఆడేవాడు. టీం ఇండియాలో హెలికాప్టర్ షాట్స్ తోనే బాగా ఫెమస్ అయ్యాడు. ఆ హెలికాప్టర్ షాట్స్ ధోని కొట్టినా ఆ షాట్స్ ని కనిపెట్టింది మాత్రం ధోని స్నేహితుడు సంతోష్ లాల్. అతను కూడా క్రికెటర్. ధోనికి సంతోష్ లాల్ ఆ హెలికాప్టర్ షాట్స్ ఎలా కొట్టాలో దానిలోని మెళుకువలను అన్నింటిని నేర్పించాడు. ధోని ఇంత పెద్ద స్టార్ క్రికెటర్ అయినా అతనితో స్నేహాన్ని వదులుకోలేదు. సంతోష్ లాల్,ధోని ఇద్దరూ కలిసి క్రికెట్ జీవితాన్ని ప్రారంభించారు. ఇద్దరు కలిసి ఎన్నో మ్యాచ్ లను ఆడారు. ఇద్దరూ కలిసి దేశం మొత్తం తిరిగి ఎన్నో మ్యాచ్ లను కలిసి ఆడారు.

వీరిద్దరు చిన్నతనం నుంచి మంచి స్నేహితులు…ఇద్దరు కలిసి ఆటలు విపరీతంగా ఆడేవారు. ఇద్దరు కలిసి రైల్వేలో ఉద్యోగం కూడా చేశారు.అయితే ఈ క్రమంలో..సంతోష్ లాల్ ఆరోగ్యం చెడింది. 2013లో మరణించాడు. తన అనారోగ్యం చూపించుకోవాలని ధోనీ అప్పుడు ఆర్ధిక సాయం కూడా చేశారు.కానీ ఫలితం లేకపోయింది.