Movies

ఇంద్ర సినిమాలో తొడ కొట్టిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలుసా?

సినిమాల్లో ఒక్కోసారి చైల్డ్ ఆర్టిస్ట్స్ నటన పెద్ద ఎసెట్ అవుతుంది. సినిమాకు అదో ఆకర్షణ గా నిలిచి,ప్రతి సందర్భంలో ఆ ఘట్టాన్ని తలచుకుంటారు చాలా మంది. ఇక ఇంద్ర సినిమా అనగానే బాలనటుడు ఠక్కున గుర్తొస్తాడు. మెగాస్టార్ కెరీర్ లో సూపర్ డూపర్ హిట్ కొట్టిన ఇంద్ర మూవీలో ఈ బుడ్డోడు విలన్ కి ఎదురొడ్డి తొడగొట్టిన సీను అప్పట్లో థియేటర్ లో మెగా అభిమానుల చేత ఈలలు వేయించింది. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్న ఆ బాలనటుడి పేరు మాస్టర్ తేజ సజ్జా. చైల్డ్ ఆర్టిస్ట్ గా దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించి,అగ్ర హీరోలతో సమానమైన గుర్తింపు పొందాడు. చూడాలని వుంది, యువరాజు,వసంతం చిత్రాల్లో అమోఘ నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసాడు.

ముఖ్యంగా మెగాస్టార్ చిరు వంటి వారి చిత్రాల్లో నటిస్తూ కూడా ఎక్కడా తొణుకు బెణుకు లేకుండా చాలా ఈజ్ తో నటించాడు తేజ. ఇంద్ర మూవీలో’నేను ఉన్నా నాయనమ్మా’ అంటూ తొడగొట్టి సవాల్ చేసిన ఘట్టం నేటికీ గుర్తిండిపోయింది అభిమానుల మదిలో. ఇక 1994 ఆగస్టు 23న జన్మించిన తేజ బాల్యం నుంచీ సినిమాలపై ఎంతో ఆసక్తి ప్రదర్శిస్తూ, ఇంట్లో టివిలో చూసి డాన్సులు ,యాక్టింగ్ అవలీలగా చేసేసేవాడు.

ఇంటిలో వాళ్ళు అతని టాలెంట్ చూసి, ముచ్చటపడిపోయేవారట. అయితే ఈ విషయం ఆనోటా, ఈనోటా వెళ్లి సినిమా పెద్దలకు చేరింది. ఆ విధంగా పిన్నవయస్సులోనే సినిమాల్లో పెద్ద ఛాన్సులు కొట్టేసాడు. దాదాపు అందరి అగ్ర హీరోలతో నటించిన తేజ నటనలో ఎంతో అనుభవం సంపాదించాడు. ముఖ్యంగా చిరుతో ఇంద్ర, ఠాకూర్, చూడాలని వుంది మూవీస్ చేసాడంటే తేజ నటనా ప్రతిభకు తార్కాణం.

బాలనటుడిగా దూసుకుపోతూ, కెరీర్ పై దృష్టి పెట్టాల్సి రావడంతో తేజ ఇక సినిమాలకు విరామం ప్రకటించాడు. స్టడీస్ సాగిస్తూ, షార్ట్ ఫిలిమ్స్ లో లైమ్ లైట్ లోకి వచ్చాడు. టాలో ద డార్క్ అనే లఘు ప్రయోగాత్మక చిత్రానికి తన గొంతు అందించాడు. ఇక ఇప్పుడు ఏకంగా హీరోగా రాబోతున్నాడు. అది కూడా హెబ్బా పటేల్ పక్కన ఛాన్స్ కొట్టేయడం విశేషం.

మిణుగురు మూవీ తో గుర్తింపులోకి వచ్చిన అయోధ్య కుమార్ డైరెక్షన్ లో త్వరలో ఓ యూత్ ఫుల్ ఎంటర్ టైన్ మూవీ తెరకెక్కబోతోంది. ఇందులో తేజ లీడ్ రోల్ పోషిస్తున్నాడు. ఇది కాకుండా పంజాబ్ నిర్మాత నీలిమా శెట్టి ప్రొడక్షన్ హౌస్ లో ప్రశాంత్ శర్మ డైరెక్షన్ లో రాబోతున్న మరో మూవీలో కూడా తేజ హీరోగా నటిసున్నాడు. అయితే ఇప్పుడు యూత్ కాంపిటేషన్ లో హీరోగా తేజ ఎంతవరకూ నిలదొక్కుకుంటాడో వేచి చూడాలి.