Movies

యాంకర్ శ్యామల ఆవేశంగా చేసిన తప్పు బిగ్ బాస్ ని ముంచేసింది…ఎలా?

బిగ్ బాస్ షో కి విపరీతమైన ప్రజాదరణ నేపథ్యంలో ఇప్పటిదాకా జరిగిన ఎలిమినేషన్స్ కన్నా, ఈ వారం జరిగిన ఎలిమినేషన్స్ గురించి చోటుచేసుకున్న చర్చ ఎప్పుడూ జరగలేదు. తేజస్విపై ఆడియన్స్ లో గల వ్యతిరేకత కారణంగానే ఇలా హాట్ టాపిక్ గా మారింది. అందరూ తేజస్వి ఎలిమినేట్ అవుతుందని అందరూ భావించారు. దీంతో శనివారం టీఆర్పీ రేటింగ్ కూడా బిగ్ బాస్ కోసం స్టార్ మా ఎక్కువే సంపాదించుకుంది.
దీంతో ఆదివారం అదిరిపోతోంది షో అనుకున్నారు అందరూ. అయితే వీక్షకుల ఆశలపై నీళ్లు జల్లిన శ్యామల అసలు ఈ షో పై ఆసక్తి కోల్పోయేలా చేసింది. ఆమె చిన్న తప్పు ఇంతటి అనర్ధం తెచ్చిపెట్టింది.

ఎందుకంటే ఆదివారం రాత్రి తెలియాల్సిన ఎలిమినేషన్ రిపోర్ట్, ఆదివారం ఉదయమే వచ్చేసిందంటే అందుకు శ్యామల తన ఫేస్ బుక్ పేజీలో పెట్టిన పోస్ట్ వీరలెవెల్లో హల్ చల్ చేయడమే. ‘నన్ను సపోర్ట్ చేసినవారందరికీ ధన్యవాదాలు. బ్యాక్ టు హోమ్. ఇక ఇశాంత్ తో ఆడుకుంటున్నా. లవ్ యు ఆల్’అంటూ ఆమె పెట్టిన పోస్ట్ క్షణాల్లో విపరీతమైన షేర్ లతో వైరల్ అయింది.

దీంతో శ్యామల ఎలిమినేట్ అయినట్లు అందరికీ పాకేసింది. శ్యామల ఆ పోస్ట్ ని వెంటనే డిలీట్ చేసినా సరే, జరిగిన నష్టం పూడ్చలేనిదిగా అయింది. ఎవరు ఎలిమినేట్ అవుతారా అని ఆడియన్స్ ఎంతో అసక్తిగా ఎదురుచూస్తుంటే, ముందే పేపర్ లీకైన చందంగా శ్యామల పెట్టిన పోస్ట్ కొంపముంచింది. వేగంగా టీఆర్పీ రేటుతో దూసుకు వెళ్లాల్సిన స్టార్ మా కు రావాల్సినంత రేటింగ్ రాలేదని విశ్లేషకులు అంచనా వేశారు.

తాము అనుకున్నట్టు తేజస్వి ఎలిమినేట్ కాకపోవడంతో ఇక ఆదివారం షో వైపు చాలామంది వీక్షకులు నిరాశతో వెళ్ళలేదు. మరి శ్యామలకు తెల్సి చేసిందా, తెలియక చేసిందా, ఆత్రుత తట్టుకోలేక చేసిందా అన్న విషయాలు పక్కన పెడితే, స్టార్ మా వాళ్లకు టీఆర్పీ రేటింగ్ దారుణంగా పడిపోయి, తీవ్రంగా నష్టం జరిగింది.

సీక్రెట్ పాటిస్తూ, జనరంజకంగా సాగుతున్న అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ లో ఇలాంటి తప్పు చేసిన శ్యామల విషయంలో బిగ్ బాస్ ఆమెపై ఎలాంటి చర్యలకు దిగబోతున్నారో వేచి చూద్దాం.