Movies

బిగ్ బాస్ 2 లో కుట్ర… తేజస్వి బదులుగా శ్యామల ఎలిమినేట్… అసలు ఏమి జరుగుతుంది

బిగ్ బాస్ మొదటి సీజన్ అంతటి సక్సెస్ కావటానికి ఎన్టీఆర్ హోస్టింగ్ ఒక ముఖ్య కారణం అని చెప్పవచ్చు. యంగ్ టైగర్ తన చరిష్మాతో బిగ్ బాస్ షోని చాలా రసవత్తరంగా,ఆసక్తికరంగా నడిపించాడు. ఇక రెండో సీజన్ కి ఎన్టీఆర్ అందుబాటులో లేకపోవటం వలన నాని హోస్ట్ గా వచ్చి ప్రేక్షకులను మెప్పించటానికి తన వంతు ప్రయత్నాన్ని చేస్తున్నాడు. ఇంకొంచెం మసాలా అంటూ నాని మొదటి నుంచి ఊదరకొడుతున్నాడు. ఎంత చేసిన హౌస్ లో ఉన్న పార్టిసిపెంట్స్ గేమ్ ఆడితేనే ఏదైనా సాధ్యం అవుతుంది. హౌస్ లో గిల్లిగజ్జాలు, అలకలు, లాలింపులు, గొడవలు, పోట్లాటలు అన్ని ఉండాలి. అప్పుడే గేమ్ చాలా రంజుగా సాగుతుంది. బిగ్ బాస్ సీజన్ 2 లో సామాన్యులకు కూడా చోటు కల్పించారు.

ప్రస్తుతం పార్టిసిపెంట్స్ నువ్వా నేనా అన్నట్టుగా గేమ్ సాగుతుండటంతో అందరు ఆసక్తిగా చూస్తున్నారు. వారం అయ్యేసరికి ఎవరో ఒకరు ఎలిమినేటి అవ్వాలి. కాబట్టి ఈ వారం శ్యామల ఎలిమినేట్ అయ్యింది. ఈ వారం తేజస్వి ఎలిమినేట్ అవుతుందని అందరూ భావించారు. హౌస్ లో ఆమె వ్యవహారశైలి పట్ల ఎవరికీ మంచి అభిప్రాయం లేదు.

తేజస్వి మాట తీరు,డ్రెస్సింగ్ అన్ని బాగాలేదని ప్రేక్షకులు విపరీతంగా విమర్శలు చేయటమే కాకుండా మైనస్ ఓటింగ్ ఎక్కువగా వచ్చినట్టు సమాచారం. అయినా తేజస్వి కాకుండా శ్యామల ఎలిమినేట్ చేసి బిగ్ బాస్ అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. శ్యామల హౌస్ లో చాలా డీసెంట్ గేమ్ ఆడుతుంది. ఆమెపై ఎలాంటి నెగిటివ్ ఓటింగ్ కూడా లేదు.

అలాగే హౌస్ లో అందరితో బాగా ఉంటుంది. అలంటి శ్యామలను ఎలిమినేట్ చేయటం తెర వెనక బిగ్ బాస్ తీసుకున్న నిర్ణయం అని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రేక్షకులు వేసే ఓటింగ్ కి విలువ లేకపోతే బిగ్ బాస్ ఆదరణ తగ్గే అవకాశం ఉంది. ఈ వారం ఎలిమినేషన్ చెరకురసం టాస్క్ చేసినప్పుడు నెగ్గిన కౌశల్,తేజస్వి లకు ఇచ్చిన ఎలిమినేషన్ సేఫ్ కార్డు ద్వారా జరిగింది.

ఎలిమినేషన్ లో ఉన్న ముగ్గురిలో ఇద్దరు నందిని,దీప్తి కౌశల్,తేజస్వి టీం లో ఉండటం వలన వారిని సేఫ్ జోన్ లోకి తీసుకువచ్చారు. దాంతో శ్యామల ఎలిమినేట్ అయ్యిపోయింది.