ఎలిమినేట్ అయిన శ్యామలను చూసి షాకింగ్ కామెంట్స్ చేసిన శ్యామల భర్త
బిగ్ బాస్ రెండో సీజన్ లో శ్యామల బిగ్ బాస్ హౌస్ లో దాదాపుగా నాలుగు వారాలు ఉండి కొన్ని ఆశ్చర్యకరమైన,ఊహించని పరిస్థితుల్లో ఎలిమినేట్ అయ్యి వచ్చిన శ్యామలను చూసి ఆమె భర్త నరసింహ షాక్ అయ్యాడట. శ్యామల టైటిల్ గెలవకపోయినా చివరి వరకు ఉంటుందని ఆశించానని, లేకపోతె కనీసం వంద రోజులు అయినా ఉంటుందని భావించానని నరసింహ కొంత నిరాశకు గురయ్యారు. బిగ్ బాస్ హౌస్ నుండి వచ్చిన శ్యామలను చూసి నరసింహ షాక్ అయ్యాడు. ఇద్దరు కొంతసేపు బాధపడి, ఆ తర్వాత శ్యామల తన కొడుకును ముద్దాడుతూ, తాను లేనప్పుడు చేసిన అల్లరి వీడియోలను చూస్తూ గడిపింది. శ్యామల బిగ్ బాస్ హౌస్ లో ఉన్నా బయట ఉన్నా ఒకటే. ఎందుకంటే ఆమె షోలతో సమయం ఖాళీ లేకుండా గడిపేస్తుంది.
శ్యామల తన కెరీర్ ని ఇంత సక్సెస్ గా సాగించటానికి,బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళటానికి శ్యామల భర్త నరసింహ ఫుల్ సపోర్ట్ ఇస్తాడు. శ్యామల బిగ్ బాస్ హౌస్ నుండి రాగానే నరసింహ కాస్త బాధపడిన, వెంటనే తేరుకొని శ్యామల బాధను తగ్గించే ప్రయత్నం చేసాడట.
అలాగే తన కొడుకుని చూసుకొని శ్యామల బిగ్ బాస్ హౌస్ ని మర్చిపోయిందని నరసింహ చెప్పుతున్నారు. శ్యామల బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తన కొడుకు ఏమి చేసాడో ప్రతిదీ రికార్డ్ చేసాడు. ఆలా శ్యామల తన కొడుకు అల్లరిని మిస్ అవ్వకుండా నరసింహ రికార్డ్ చేసి శ్యామలను ఆశ్చర్యంలో ముంచెత్తాడు.