యాంకర్ శ్యామలకి ఎంత పారితోషికం ఇచ్చారో తెలుసా? షాకింగ్ కామెంట్స్ చేసిన శ్యామల
ఎంతో ఆసక్తికరంగా సాగుతున్న బిగ్ బాస్ సీజన్ టు షోలో చోటు చేసుకున్న పరిణామాలతో ఒకింత నిరాశ అలుముకుంది. తేజస్విని,కౌశల్ ఎలిమినేషన్ కి దగ్గరలో ఉండగా సడన్ గా శ్యామల ఎలిమినేషన్ అవ్వడంతో అందరూ షాక్ కి గురయ్యారు. శ్యామలకు,నందినికి,దీప్తికి వీళ్ళందరికీ ఓట్లు పడ్డాయి. అయితే ఎక్కువ నెగెటివ్ మెసేజ్ లతో పాటు తక్కువ ఓట్లు మాత్రం తేజస్వికి పడ్డాయి.కానీ ఎలిమినేషన్ దెబ్బ శ్యామలపై పడింది.ఇక శ్యామల బయటకొచ్చాక తన కొడుకు ఇశాంత్ తో చాలా సమయం సంతోషంగా గడిపింది. అలాగే తనను సపోర్ట్ చేసి ఓటుచేసిన ఫాన్స్, ఫాలోయర్స్,ఇలా అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెల్పింది. అయితే లైవ్ ఇంటర్వ్యూ కి వెళ్ళింది అక్కడ ఎదుర్కొన్న మొదటి క్వశ్చన్ ఏమిటంటే, మీకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారని? అయితే శ్యామల దానికి బానే సమాధానం ఇచ్చింది.
మొదట్లో సంజన, నూతన నాయుడు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేషన్ అయ్యారు. అయితే వీరిద్దరూ కామన్ పీపుల్ కావడం, మొదట్లోనే ఎలిమినేట్ అవ్వడంతో వాళ్ళ గురించి పెద్దగా ఎవరికీ తెలీదు. ఇక బిగ్ బాస్ షో గురించి పూర్తిగా తెలీదు. అందుకే వాళ్లకి రెమ్యునరేషన్ దక్కలేదు. ఆ తర్వాత ఎలిమినేషన్ అయిన కిరీటికి రెమ్యునరేషన్ టాక్స్ లు పోను 5లక్షలు చేతికి అందాయి. ఈవిషయాన్ని కిరీటి చెప్పాడు.కానీ శ్యామల విషయం అలా కాదు.
ఈమె సెలబ్రిటీ. పేరున్న యాంకర్. బిగ్ బాస్ షో లో పాల్గొన కుండా వేరే షోలు చేసి ఉంటే చాలా డబ్బు కూడబెట్టేది. అయితే బిగ్ బాస్ రోజుకి టాక్స్ లు పోను 30వేలు అగ్రిమెంట్ లో రాసుకున్నారట. ఇక ఆమె ఎన్ని రోజులు షో లో ఉందొ అన్ని రోజులకు ముప్పై వేలు చొప్పున ఇస్తున్నారట. అగ్రిమెంట్ ప్రకారమే ఇలా ఇచ్చారని,ఇందులో ఎలాంటి తప్పు లేదని శ్యామల అంటోంది. అయితే ఎలిమినేషన్ కి సంబంధించి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ,అది వాళ్లకి వచ్చిన ఓటింగ్ పవర్,నాకు ఆడియన్స్ వేసిన ఓట్లు ఆధారంగా జరిగిందని నిరాశగా చెప్పుకొచ్చింది.