ఎలిమినేషన్ టాస్క్ లో ఎవరికి అన్యాయం జరిగింది… ఎవరు బలి అయ్యారు
శ్యామల ఎపిసోడ్ తో ఆదివారం నాటి బిగ్ బాస్ షో లో అందరికీ కాస్త బాధను మిగిల్చి, ఆదివారం హోస్ లో హీట్ మరింత పెరిగింది. అయితే సోమవారం పరిస్థితి సందడిగా మారిపోయింది. ఎలిమినేషన్ కోసం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లు,కొంత బాధ,మరి కొంత సంతోషం,ఇంకాస్త సరదా తో సాగింది. ఇక ఈ వారం నామినేషన్ కోసం గార్డెన్ ఏరియాలో ఓ టెలిఫోన్ బూత్ ఏర్పాటుచేశారు. అది చూసి హౌస్ మెంబర్స్ లో ఆనందం వెల్లివిరిసింది. అది ల్యాండ్ లైన్ కావడం, పనిచేస్తూ ఉండడంతో బిగ్ బాస్ దాంతో ఏం చేయబోతున్నారనే ఆసక్తి నెలకొంది. ఆ ఎదురుచూపులు ఎంతోకాలం లేవు. వెంటనే ఫోన్ మోగడంతో మెట్లమీద గల తేజస్వి పరుగున వెళ్లి లిఫ్ట్ చేసింది. అయితే ఆ ఫోన్ చేసింది బిగ్ బాస్ కావడంతో తేజస్వి పప్పులో కాలేసినట్టు అయింది. మొదటి ఫోన్ లిఫ్ట్ చేసినందుకు ఎలిమినేషన్ కి నామినేషన్ అయినట్లు బిగ్ బాస్ చెప్పారు.
అయితే దీన్నుంచి తప్పించుకోవాలంటే,క్లిన్ షేవ్ చేసుకునేలా సామ్రాట్ ని ఒప్పించుకోవాలని బిగ్ బాస్ చెప్పారు. ఇక తేజస్విని కాపాడ్డానికి సామ్రాట్ అంగీకరించి,క్లిన్ షేవ్ కి సిద్ధమయ్యాడు. సామ్రాట్ ముందుగా ట్రిమ్మర్ తో గెడ్డం ,మీసాలు తీసేసి,బిగ్ బాస్ ఇచ్చిన రేజర్ తో క్లిన్ షేవ్ చేసుకున్నాడు. దీంతో చాలా స్మార్ట్ గా కనిపించాడు.
నిజానికి గెడ్డం తీయబోనని ఇంటి సభ్యులతో గతంలో సామ్రాట్ చెప్పాడట. అందుకే ఆ గెడ్డాన్ని బిగ్ బాస్ టార్గెట్ చేసాడు. మొత్తానికి సామ్రాట్ కొత్త లుక్ చూసి హౌస్ మెంబర్స్ చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక తేజస్వి నామినేషన్ నుంచి బయటపడ్డట్టు బిగ్ బాస్ ప్రకటించారు. దీన్ని బట్టి బూత్ లో కి వస్తే, నామినేషన్ లో వున్నట్టని,ఇక బిగ్ బాస్ చెప్పిన టాస్క్ చేయగలిగితే దాన్నుంచి తప్పించుకున్నట్లు అన్నమాట.
ఇక ఆ తర్వాత బూత్ లోకి వెళ్లాలని బిగ్ బాస్ ఆదేశించడంతో గణేష్ వెళ్లడంతో నామినేషన్ కి వెళ్ళినట్టే. అయితే దీన్నుంచి బయట పడాలంటే బాబు గోగినేని చేత రెండు కొత్తిమీర కట్టలు తినిపించాలన్నది షరతు. అయితే బాబు అసలు కొత్తిమీర తనరట ఇంట్లో కూరల్లో కొత్తిమీర కనిపిస్తే పక్కన పారేస్తారట. కానీ గణేష్ కోసం మొత్తం కొత్తిమీర బాబు గోగినేని తినేశారు. దీంతో గణేష్ నామినేషన్ నుంచి తప్పించుకున్నాడు.
ఇక కౌశల్ ప్రతివారం తనను తాను నామినేషన్ చేసుకునేలా నందిని తో చెప్పించి ఒప్పించాలని దీప్తికి బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. దీనికి కౌశల్ ఒప్పుకోకపోవడంతో దీప్తి నామినేషన్ కి వెళ్లాల్సి వచ్చింది. తన తెల్ల దుప్పటిని ముక్కలు ముక్కలుగా కత్తిరించుకునేలా తేజస్విని ని గీతామాధురి ఒప్పించాలి. దీనికి తేజస్వి ఒప్పుకోవడంతో నామినేట్ నుంచి గీతా మాధురి తప్పించుకుంది.
తనపై గీతకు ఉన్న అభిప్రాయం పోవాలని భావించిన తేజస్విని తనకు ఎంతో ఇష్టమైన దుప్పటిని ముక్కలు ముక్కలుగా కత్తిరించేసింది. ఇక గీతా మాధురి తన ఒంటిమీద బిగ్ బాస్ పరిమినెంట్ టోటో వేయించుకునేలా ఒప్పించాలని బాబు గోగినేనికి టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. దీనికి గీతా మాధురి ఒప్పేసుకోవడంతో బాబు గోగినేని సేఫ్ అయ్యాడు. ఇక తనీష్ విషయానికి వస్తే,తన జుట్టు కత్తిరించుకునేలా దీప్తి సునైనాను ఒప్పించాలి.
దీనికి ఆమె ఒప్పుకుని జుట్టు కత్తిరించుకుంది. ఇక నందిని దగ్గర కొస్తే,తన బట్టలన్నీ సూట్ కేసులో పెట్టి, సూట్ కేసుని స్టోర్ రూమ్ లో పడేసే విధంగా భానుశ్రీని ఒప్పించాలి. అయితే భానుశ్రీ దీనికి ఒప్పేసుకోవడంతో నందిని గండం నుంచి బయట పడింది. కాగా దీప్తి సునైనా సేఫ్ అవ్వాలనే యాంకర్ దీప్తి కాకరకాయ ఐటమ్స్ తినేలా ఒప్పించాలి. దీనికి దీప్తి అంగీకరించి కాకరకాయ తో చేసిన పదార్ధాలు, జ్యుస్ లాగించేసింది. ఆ తర్వాత వాంతి కూడా చేసుకుంది.
అయితే సునైనాను తప్పించడానికి చేసిన పని. ఇక భానుశ్రీ వంతు వచ్చింది. అమిత్ తన జుట్టుకి గల స్కార్ఫ్ తీసెయ్యాలి. కెప్టెన్సీ పోటీకి రానని ప్రకటించాలి. అయితే భానుశ్రీ కోసం అమిత్ ఓకే అన్నాడు. అయితే సామ్రాట్ బయటకు వచ్చి తేజస్వితో డిస్కషన్ అయ్యాక,నేను ఈ పనికి ఒప్పుకోవడం లేదని భానుశ్రీకి అమిత్ సారీ చెప్పి నేను ఈ పని చేయలేకపోతున్నాను అనేసి బయటకు వచ్చేసాడు మొత్తం మీద దీప్తి, భానుశ్రీ, గణేష్ లు ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు.